భారత్‌పై పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ ఇతరులపై నిందలు వేయడం కంటే పాకిస్థాన్ తనలో తాను ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించేందుకు విశ్వసనీయ చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంలో భాగంగా ఉపయోగించే ధోరణిని విడనాడాలని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా, శనివారం రాత్రి కరాచీలోని సింధ్ రేంజర్స్ భిట్టాయ్ వింగ్ ప్రధాన కార్యాలయంపై భారీ ఉగ్రదాడి జరిగింది. రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో ఆయుధాలతో వచ్చిన ఉగ్రవాదులు వాహనాన్ని ప్రధాన గేటుకు ఢీకొట్టి బలవంతంగా లోపలికి ప్రవేశించారు. అనంతరం గ్రెనేడ్లు విసురుతూ కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉగ్రవాదుల దాడికి రేంజర్స్ సిబ్బంది వెంటనే ప్రతిదాడి ప్రారంభించారు. అనంతరం స్పెషల్ సెక్యూరిటీ యూనిట్ (ఎస్ఎస్యూ), యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్ (ఏటీఎఫ్) కమాండోలు రంగంలోకి దిగడంతో సుమారు 90 నిమిషాల పాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ ఆపరేషన్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో గాయపడిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

More Stories
అమెరికా, ఇజ్రాయెల్‌లపై అంతర్జాతీయ కోర్టులను ఇరాన్
సౌదీలో అరాంకో హెలికాప్టర్ కూలి 14 మంది మృతి
హిందూ మహాసముద్ర ప్రాంతం భద్రత, సుస్థిరత ఉమ్మడి బాధ్యత