దశాబ్దాలుగా తీవ్ర ఉద్రిక్తతలతో సమతమవుతున్న ఇజ్రాయెల్, లెబనాన్‌లో దేశాల్లో శాంతి భద్రతల స్థాపన దిశగా ఒక చరిత్రాత్మక ముందడుగు పడింది. అమెరికా మధ్య వర్తిత్వంతో ఈ రెండు దేశాల మధ్య అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఒక చరిత్రాత్మక ‘ఫ్రేమ్‌వర్క్ శాంతి ఒప్పందం’ కుదిరింది. శాంతి ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
హిజ్బుల్లా వంటి సాయుధ గ్రూపుల నిరాయుధీకరణ, లెబనాన్ సార్వభౌమాధికారాన్ని పునరుద్ధరించడం, రెండు దేశాల మధ్య శత్రుత్వాలకు ముగింపు పలకడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం ఈ ఒప్పందం శాశ్వత శాంతి భద్రతల కోసం ఒక చట్రాన్ని ఏర్పాటు చేయడానికి నాంది పలుకుతుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు.
ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ పరస్పర దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్, లెబనాన్ రెండు దేశాలు రెండూశాంతియుతంగా జీవిస్తూ తమ తమ దేశాల సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని ఇరుదేశాల మధ్య ఇతర దేశాల జోక్యాన్ని నిలిపివేయాలని పేర్కొన్నాయి.
అలాగే ఇన్నాళ్లు నిర్బంధంలో ఉన్నవారి విడుదల, మృతదేహాల అవశేషాలను తిరిగి అప్పగించేందుకు కృషి చేస్తామని ఇరు దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. ఇరు దేశాల ప్రజలు సురక్షితంగా తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లడానికి, భవిష్యత్తులో రెండు దేశాల మధ్య శాంతియుత సంబంధాలు ఏర్పడటానికి ఇది తొలి అడుగు అని అమెరికా, ఇజ్రాయెల్, లెబనాన్ అధికారులు పేర్కొన్నారు.
శుక్రవారం నాటి ఒప్పందంలో హిజ్బుల్లా భాగస్వామి కాకపోవడంతో దక్షిణ లెబనాన్‌లోని దక్షిణ లిటాని ప్రాంతం నుండి తన యోధులను ఉపసంహరించుకోవడానికి అది అంగీకరిస్తుందో లేదో స్పష్టంగా లేదు. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత, ఇరాన్‌తో కుదుర్చుకున్న తన శాంతి ఒప్పందాన్ని దెబ్బతీస్తుందని వాషింగ్టన్ భయపడుతోంది. ఈ ఒప్పందంలో లెబనాన్‌తో సహా “అన్ని రంగాలలో” పోరాటాన్ని ముగించాలనే నిబద్ధత కూడా ఉంది.
14-సూత్రాల ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంలో, ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు రెండూ “శాంతియుతంగా జీవించే” తమ తమ రాష్ట్రాల హక్కును “ధృవీకరించుకున్నాయి”. “పొరుగు సార్వభౌమ రాష్ట్రాలుగా భద్రతతో జీవించాలనే పరస్పర కోరికను” వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య “అంతర్జాతీయ రాజకీయ లేదా న్యాయ వేదికలలో అన్ని శత్రుత్వ లేదా ప్రతికూల చర్యలను నిలిపివేయాలని” ఇది ప్రత్యేకంగా పేర్కొంది. నిర్బంధంలో ఉన్నవారి విడుదల, అలాగే ఏవైనా అవశేషాలను తిరిగి అప్పగించడం కోసం కృషి చేస్తామని ఇరు దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. అయితే, “ఈ ఫ్రేమ్‌వర్క్‌లోని ఏదీ తమను తాము రక్షించుకోవడానికి ఉన్న సహజ హక్కును వినియోగించుకోకుండా నిరోధించదు” అని ఇరు దేశాల ప్రభుత్వాలు అంగీకరించాయి.
More Stories
షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు పహల్గాం దాడి సూత్రధారి
డెన్మార్క్ లో ఇస్లామిక్ ప్రార్థన `అజాన్’పై దేశవ్యాప్త నిషేధం!
‘హార్ముజ్’ వద్ద అమెరికా, ఇరాన్ మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ