భారత్‌లో ముస్లిం ప్రార్థనా స్థలాలపై పాక్ అధ్యక్షుని వ్యాఖ్యలపై ఆగ్రహం

భారత్‌లో ముస్లిం ప్రార్థనా స్థలాలపై పాక్ అధ్యక్షుని వ్యాఖ్యలపై ఆగ్రహం
*  అసీఫ్ అలీ జర్దారి వాఖ్యాలను తీవ్రంగా ఖండించిన భారత్ 
 
భారత్‌లో చార్రితక ముస్లిం ప్రార్థనా స్థలాల కూల్చివేస్తున్నారంటూ పాక్ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారి చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ ఉద్దేశపూర్వక రాజకీయ దాడికి దిగుతోందని విదేశాంగ విభాగం తిప్పికొట్టింది.   పాక్ అధ్యక్షుడు జర్దారీ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్టులో భారత్‌లో చారిత్రక ముస్లిం మతపరమైన స్థలాలను కూల్చివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
వారణాసిలోని వెయ్యేళ్ల చరిత్ర కలిగిన మసీదు గంజ్ షహీదాపై ఉన్న ముప్పును ప్రస్తావిస్తూ ఇలాంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. మైనార్టీ హక్కులు, ఇరు దేశాలకు సంబంధించిన ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాలని భారత్‌కు ఆయన సూచించారు. జర్దారీ చేసిన వ్యాఖ్యలపై భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. 
 
దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు జర్దారీకి లేదని స్పష్టంచేసింది. ఆయన వ్యాఖ్యలు అసంబద్ధమైనవని, అనవసరమైనవని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కొట్టిపారేశారు. భారత్ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే హక్కు పాకిస్థాన్ అధ్యక్షుడికి లేదంటూ స్పష్టం చేశారు.  మానవ హక్కుల పరిరక్షణ విషయంలో పాకిస్థాన్ ప్రపంచం ముందు విమర్శలకు గురవుతోందని ఈ సందర్భంగా జైస్వాల్ గుర్తు చేశారు. 
 
మైనార్టీలను పాకిస్థాన్ కొన్ని దశాబ్దాలుగా ప్రణాళిక ప్రకారం వివక్ష, వేధింపులకు గురి చేస్తోందని, ప్రపంచానికి ఈ విషయం తెలుసుని గుర్తు చేశారు. ఇతరులకు హితవు పలికే ముందు పాక్ తన దేశంలోని పరిస్థితులను చక్కదిద్దుకోవాలని సూచించారు. ద్వేషం, మతతత్వాన్ని ప్రోత్సహించడమే పాకిస్థాన్ జాతీయ విధానంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు.  

పాకిస్థాన్ జాతీయ విధానాల్లో ఉన్న మత అసహనం, ద్వేష భావజాలం కారణంగానే ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయంటూ జైస్వాల్ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జర్దారీ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఉద్దేశాలతోనే చేసి దాడిగానే చూడాలని భారత్ స్పష్టం చేసింది. 
 
గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.  విమర్శించారు. భారత్ తన అంతర్గత విధానాలకు సంబంధించిన అంశాల్లో, ముఖ్యంగా జమ్మూకశ్మీర్ వంటి విషయాల్లో విదేశాల జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని చాలాకాలంగా హెచ్చరిస్తోం తాజాగా పాక్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలతో దాయాది దేశాల మధ్య మరోసారి మాటల యుద్ధం ప్రారంభమైనట్లు అనిపిస్తుంది.