డాక్ట‌ర్ ప్రిస్క్పిప్ష‌న్‌ ఉంటేనే ద‌గ్గు సిర‌ప్‌లు

డాక్ట‌ర్ ప్రిస్క్పిప్ష‌న్‌ ఉంటేనే ద‌గ్గు సిర‌ప్‌లు

వైద్యుని ప్రిస్కిప్షన్ (మందుల చీటీ) లేకుండా సిరప్ లను కొనుగోలు చేసేందుకు కేంద్రం నిరాకరించింది. దగ్గు సిరప్ సహా అన్ని సిరప్ లను కొనుగోలు చేయడానికి ఇకపై వైద్యుని ప్రిస్కిప్షన్ తప్పని సరిచేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళశారం నోటిఫికేషన్ జారీ చేసింది. సిరప్ లను వైద్యుని సూచనలు లేకుండా సిరప్ లను కొగుగోలు చేసే విధానం ఇకపై అనుమతించబడదు. 

`డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940′ కి సంబంధించిన నిబంధనలను నిర్దేశించే డ్రగ్స్ రూల్స్ , 1945 లో చేసిన మార్పుల గురించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. చట్టంలోని నిబంధనల నుండి మినహాయించబడిన వాటి జాబితాలో సిరప్ అనే పదాన్ని తొలగించాలని తాజా నోటిఫికేషన్ ఆదేశించింది. అయితే గతంలో దగ్గు సిరప్, లాజెంజ్ లు (హాల్స్, స్ట్రెప్సిల్స్ వంటివి), టాబ్లెట్స్ ను మినహాయించింది. 

డిసెంబర్ 2025లో జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌ను అనుసరించి ఈ సవరణ జరిగింది. ఆ నోటిఫికేషన్‌పై ప్రభుత్వం భాగస్వాములు, ప్రజల నుండి అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానించింది. నోటిఫికేషన్ ప్రకారం, తుది నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందు ముసాయిదా నియమాలపై అందిన అన్ని వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

త‌మిళ‌నాడుకు చెందిన శ్రీస‌న్ కంపెనీ ఉత్ప‌త్తి చేస్తున్న కోల్డ్రిఫ్ ద‌గ్గు సిర‌ప్ తాగి సుమారు 20 మంది చిన్నారులు మృతిచెందారు. అయితే ఆ ఘ‌ట‌న ప‌ట్ల ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. భార‌త్ త‌యారీకి చెందిన ద‌గ్గు మందుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో త‌న హెచ్చ‌రిక‌ల్లో పేర్కొన్న విష‌యం తెలిసిందే. దానితో పాత చట్టానికి సవరణలు చేస్తూ 2026 డ్ర‌గ్స్ రూల్స్‌ను కేంద్రం నోటిఫై చేసింది.  

షెడ్యూల్ కేలో భాగంగా సిర‌ప్ ప‌దాన్ని ఆ కేట‌గిరీ నుంచి తొల‌గించారు. డ్ర‌గ్స్ యాక్ట్ 1940 ప్ర‌కారం ఆ కేట‌గిరీలో కొన్ని మందుల త‌యారీ, స‌ర‌ఫ‌రా, అమ్మ‌కాల‌పై నిషేధం మిన‌హాయింపు ఇస్తారు. షెడ్యూల్ కేలో ఉన్న డ్రగ్స్‌ను ఎటువంటి లైసెన్సు లేకుండానే అమ్ముకోవ‌చ్చు. 

ఇంటి చిట్కాలుగా భావిస్తూ ఆస్ప‌రిన్‌, పారాసిట‌మాల్‌, అన‌ల్జ‌సిక్ బామ్స్ లాంటి కొన్ని మందులు అమ్ముకునేందుకు వీలు ఉంది.అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్ నుంచి సిర‌ప్ అనే ప‌దాన్ని తొల‌గించారు. ద‌గ్గు కోసం వాడే సిర‌ప్‌లు, లాజెంజిస్‌, పిల్స్‌, ట్యాబ్‌లెట్లు కూడా అందులో ఉన్నాయి. ప్ర‌భుత్వం అధికారిక గెజిట్ ప్ర‌చురించ‌డం వ‌ల్ల కొత్త‌గా చేప‌ట్టిన స‌వ‌ర‌ణ అమ‌లులోకి వ‌చ్చేస్తుంది.