ఒమ‌న్ తీరంలో ముగ్గురు భార‌త నావికులు మృతి

ఒమ‌న్ తీరంలో ముగ్గురు భార‌త నావికులు మృతి
అమెరికా వైమానిక దాడిలో భార‌త్‌కు చెందిన ముగ్గురు నావికులుమృతిచెందారు. వాస్త‌వానికి గ‌త వారం జ‌రిగిన ఆ ఘ‌ట‌న‌లో ఆ నావికులు తప్పిపోయిన్నట్లు భావించారు. కానీ ఒమ‌న్ తీరంలో వాణిజ్య నౌక‌పై జ‌రిగిన దాడిలో ఆ ముగ్గురు నౌకాద‌ళ సిబ్బంది మృతిచెందిన‌ట్లు షిప్పింగ్ శాఖ మంత్రి స‌ర్బానంద సోనోవాల్ తెలిపారు. 
ఎంటీ సిట్టిబెల్లో అనే నౌక‌లో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. దీంట్లో 24 మంది భార‌తీయులే.
విదేశీయుల్లో ఇద్ద‌రు పాకిస్తానీలు, ఒక‌రు ఉక్రెయిన్ , ర‌ష్యా వ్య‌క్తి ఉన్నారు. గల్ఫ్ ఆఫ్ ఒమ‌న్‌లో ఆ నౌక‌పై అమెరికా దాడి చేసింది. మృతిచెందిన వారిని డెక్ క్యాడెట్ ఆదిత్య శ‌ర్మ, ఇంజిన్ ఫిట్ట‌ర్ శివానంద చౌరాసియా, చీఫ్ ఇంజినీర్ ప‌ట్నాలా సురేశ్‌గా గుర్తించారు.  ఒమ‌న్ తీరంలో వెళ్తున్న నౌక‌పై ప్రిసిష‌న్ మునిష‌న్ బాంబుల‌తో సెంట్ర‌ల్ క‌మాండ్ ద‌ళాలు దాడి చేశాయి. ఇరాన్ సంక్షోభ వేళ ఆ నౌక ఆదేశాలను ఉల్లంఘించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 
అయితే ఐక్య‌రాజ్య‌స‌మితి వేదిక‌గా ఆ దాడిని భారత్ ఖండించింది. 24 మంది భార‌తీయులున్న నౌక‌పై అమెరికా నేవీ దాడి చేసింద‌ని పేర్కొన్నారు. హోర్ముజ్‌ను క్రాస్ చేస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిందని తెలిపారు.  ఇరాన్ నుంచి ఇంధనం తీసుకెళ్తున్న వాణిజ్య నౌక‌పై త‌మ యుద్ధ‌విమానాలు దాడి చేసిన‌ట్లు సెంట్ర‌ల్ క‌మాండ్ చెప్పింది. ఆ ప్ర‌మాదం ముగ్గురు నావికులు మృతిచెందడం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని మంత్రి సోనోవాల్ తెలిపారు.
తొలుత మిస్సైనట్లు భావించిన వారి దేహాల‌ను గుర్తించిన‌ట్లు వెల్ల‌డించారు. నౌకాద‌ళ సిబ్బందికి ఇది తీర‌ని లోటు అన్నారు. వారి కుటుంబ‌స‌భ్యుల‌ను ఆదుకునేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు. హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ చేసిన దాడుల్లో అమెరికాకు చెందిన అపాచీ యుద్ధ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
ఆ సమయంలో ఒమాన్ తీరంలో మిస్సైల్ దాడులు చేపట్టగా అందులో ఓ ఆయిల్ ట్యాంకర్‌పై కూడా అమెరికా బాంబుల వర్షం కురిపించింది.  ఇటీవల ఇలాంటి ఘటనలు జరగడం ఇది మూడవసారి. మొదటి ఘటన జూన్ 8న ‘ఏంటి మారివెక్స్’ నౌకపై దాడి కారణంగా మంటలు చెలరేగాయి. ఆ ట్యాంకర్ సిబ్బందిలో మొత్తం 24 మంది భారతీయులు ఉండగా, వారందరినీ సురక్షితంగా రక్షించారు. రెండవ ఘటన జూన్ 10న జరిగింది. అప్పుడు ఒమన్ గల్ఫ్ ప్రాంతంలో పలావు  దేశపు జెండాను కలిగి ఉన్న ‘ఏంటి సెట్టెబెల్లో’ అనే ట్యాంకర్ పై దాడి జరిగింది.