మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు,  తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. ఆమె మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేయగా స్క్రూట్నీలో తిరస్కరణకు గురైంది.  ఆమె ఒక కేసుకు సంబంధించిన వివరాలను దాచడమే ఇందుకు కారణమని మధ్యప్రదేశ్ అసెంబ్లీ అధికారి ఒకరు వెల్లడించారు.
 
ఆస్తుల వివరాలను, తెలంగాణలో తనపై ఉన్న క్రిమినల్ కేసులను అఫిడ్‌విట్‌లో మీనాక్షి నటరాజన్ వెల్లడించలేదని  మధ్యప్రదేశ్ రాజ్యసభ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవత్ అంతకుముందు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.  మహేశ్ కేవత్ తరఫు న్యాయవాది సంకేత్ గుప్త విలేకరులతో మాట్లాడుతూ, “తెలంగాణ కోర్టులో మీనాక్షి నటరాజన్పై ఒక క్రిమినల్ కేసు పెండింగ్లో ఉందని, అయితే దీనిని ఆమె తన అఫిడవిట్లో పేర్కొనలేదు” అని తెలిపారు. ఆ
 
“సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, అభ్యర్థులు తమ అఫిడవిట్లో ఈ సమాచారాన్ని కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఇదే నిబంధన కింద కేవత్ కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్పై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఆమె నామినేషన్ పత్రాల్లో మరికొన్ని లోపాలు ఉన్నాయి. అందుకే రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ను తిరస్కరించారు” అని చెప్పారు.
 
నటరాజన్పై ఎలాంటి కేసు నమోదు కాలేదని, ఆమెను వేధించడానికే బీజేపీ ఇలాంటి కేసులను తెరపైకి తెస్తోందని  కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ హరీశ్ చౌదరి ఆరోపించారు. కోర్టు నుంచి నటరాజన్కు కేవలం షోకాజ్ నోటీసు మాత్రమే వచ్చిందని, దానిని అఫిడవిట్లో పేర్కొనాల్సిన అవసరం లేదని, కేసు నమోదైనప్పుడు మాత్రమే ఈ సమాచారాన్ని నామినేషన్ పత్రాల్లో రాయాల్సి ఉంటుందని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని స్పష్టం చేశారు.  
 
కేవలం నోటీసు వచ్చినంత మాత్రాన ఈ వివరాలు చెప్పాల్సిన పనిలేదని పేర్కొన్నారు. సాంకేతికంగా నటరాజన్ నామినేషన్ను తిరస్కరించడం సాధ్యం కాదని హరీశ్ చౌదరి అభిప్రాయపడ్డారు. తన నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై మీనాక్షి స్పందిస్తూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థల మీద బీజేపీ దాడిచేస్తోందని విమర్శించారు.  సరైన బలం లేని చోట బీజేపీ అభ్యర్థిని నిలపడంలోనే ఆ పార్టీ వైఖరి, విధానం అర్థమవుతోందని ఆమె ధ్వజమెత్తారు. 
 
ఇది ఒక రాజ్యసభ సీటుకు సంబంధించిన అంశం కాదని, భారత ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశమని ఆమె పేర్కొన్నారు.  ఇది కేంద్రం కుట్ర అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. మొన్న ఓటు చోరీ, ఇప్పుడు సీటు చోరీ అంటూ రతెలంగాణలో మీనాక్షిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ఆయన తెలిపారు.