గుండ్లకమ్మ లాంటి జీవనదులను రక్షించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి రవికుమార్ పిలుపిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవo సందర్భంగా అద్దంకిలో గుండ్లకమ్మ నది ఒడ్డున హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతినికాపాడాలని కోరారు. కాపాడుకుంటేనే జీవరాశి మనగడ అని రవికుమార్ స్పష్టం చేశారు.
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ డా. దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యమని,నాటినుండి నేటి వరకు మానవుడు నదీ పరివాహ ప్రాంతాలను నివాసయోగ్యాలుగా ఎంచుకొని జీవిస్తున్నాడని తెలిపారు. గుండ్లకమ్మ లాంటి జీవనధులను చెత్తాచెదారంతో డంపు చేస్తూ, సాగు పేరుతో నది భూగర్భాన్ని ఆక్రమించుకుంటూ త్రాగునీరు, సాగునీరు ను కెమికల్స్ తో కలుషితం చేస్తున్న వారి పట్ల సంబంధిత అధికారులు ఉదాసీన వైఖరిని విడనాడి జీవనది గుండ్లకమ్మను కాపాడాలని కోరారు.
ఆ ప్రయత్నమే నేడు గుండకమ్మ పుట్టిన గుండ్ల బ్రహ్మేశ్వరం దగ్గర నుండి తూర్పున బంగాళాఖాతంలో కలిసే గుండాయపాలెం వరకు మూడు జిల్లాలలో ఏడు నియోజకవర్గాల నుండి కలుపుతూ సుమారు 230 కిలోమీటర్ల ప్రవహిస్తున్న గుండ్లకమ్మ నదికి ఇరువైపుల నేడు ఒకేరోజు ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో నేడు ఈ బృహత్తకరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
అందరి సహకారంతో గుండ్లకమ్మను, గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతాన్ని కాపాడుకుందామని చైర్మన్ దాసరి శ్రీనివాసులు పిలుపిచ్చారు. ఆధ్యాత్మిక మహిళ బృందం ప్రకృతి నియమాలతో, మంత్రోచ్ఛరణ, వాయిద్యాలతో మొక్కలను నాటడం జరిగింది. ఈరోజు కార్యక్రమానికి రావి,మేడి, బాదం,కదంబం,మహాగని,గానుగా,మొదలగు ఆయుర్వేద మొక్కలను అందించిన గుండ్లకమ్మ నది పరిరక్షకులు పోరాట యోధులు మన్నం త్రిమూర్తులను దాసరి శ్రీనివాసులు అభినందించారు.
హిందూ ధర్మ పరిరక్షణ రాష్ట్ర కోఆర్డినేటర్ సంధి రెడ్డి కొండలరావు, జీవనది గుండ్లకమ్మ పరిరక్షణ పోరాట యోధులు మన్నం త్రిమూర్తులు, చిన్ని శ్రీనివాసరావు, నాగినేని రామకృష్ణ, సంధి రెడ్డి శ్రీనివాసరావు, కాకాని అశోక్, సంధి రెడ్డి రమేష్, దామా హనుమంతరావు, లహరి,ఆధ్యాత్మిక సాధకురాలు ప్రకృతి ప్రేమికులు వేముల రమసుందరి, గ్రంధి నాగరాజ కుమారి, నాగసూరి మంజుల, గాదన్ శెట్టి సునీత, అలహరి సుధారాణి, గొట్టిపాటి అనురాధ, తదితరులు పాల్గొన్నారు.

More Stories
రూ. 10 వేల కోట్ల పెట్టుబడితో రాయలసీమ అభివృద్ధి
ప్రభుత్వ సిలబస్ అమలు చేయని కార్పొరేట్ విద్యా సంస్థలు
తిరుమలలో ఏఐ ఆధారిత సేవల నిర్వహణ ప్రశంసనీయం