* క్వాలిఫయర్‌కు దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్
రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరో సంచలనం నమోదు చేశాడు. చండీగఢ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో 14 ఏళ్ల రికార్డ్‌ను బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలి నుంచే సిక్సర్లతో విరుచుకుపడ్డ వైభవ్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 8 సిక్స్‌లు ఉండడం విశేషం.
ఈ క్రమంలోనే ఐపీఎల్లో సింగిల్ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా వైభవ్ తన పేరును రికార్డుల్లోకెక్కించుకున్నాడు. ఇప్పటిదాకా ఈ సీజన్‌లో వైభవ్ 61* సిక్స్‌లు బాదాడు. దీంతో మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డ్ తుడిచిపెట్టుకుపోయింది. అతడు 2012 ఎడిషన్‌లో 59 సిక్స్‌లు కొట్టాడు. ప్రస్తుత సీజన్‌లో వైభవ్ ఆ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించాడు.
సన్‌రైజర్స్ బౌలింగ్‌ను ఊచకోత కోసిన వైభవ్ సూర్యవంశీ తన సునామీ ఇన్నింగ్స్‌లో ఒకే సీజన్ పవర్‌ప్లేలో 490 పరుగులు చేసి డేవిడ్ వార్నర్ (2016లో 467 రన్స్)సు అధిగమించాడు. ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు (680) సాధించిన అన్‌క్యాప్డ్ బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా నాలుగుసార్లు(పదికి పైగా) సిక్సర్లు బాది క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో 16 బంతుల్లోనే ఫిఫ్టీ అందుకున్న వైభవ్ ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన రైనా (2014లో పంజాబ్‌పై) రికార్డును సమం చేశాడు.
కాగా, ఐపీఎల్19వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరు ముగిసింది. లీగ్ దశలో రాజస్థాన్ రాయల్స్‌పై రెండుసార్లు గెలిచిన రైజర్స్ ఈసారి యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల సునామీలో కొట్టుకుపోయింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో తేలిపోయి 47 రన్స్ తేడాతో చిత్తయింది. తొలుత రాజస్థాన్ 20 ఓవర్లలో243/8 స్కోరు చేసింది.
వైభవ్‌తో పాటు ధ్రువ్ జురెల్ (21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50) కూడా రాణించాడు. అనంతరం ఛేజింగ్‌లో రైజర్స్ 19.2 ఓవర్లలో 196 రన్స్‌కే ఆలౌటైంది. నితీశ్ రెడ్డి (38), సలీల్ అరోరా (35), ఇషాన్ (33) టాప్ స్కోరర్లు. జోఫ్రా ఆర్చర్ (3/58), జడేజా (2/21) దెబ్బకొట్టారు. వైభవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. భారీ హిట్లర్లంతా బ్యాట్లెత్తేయడంతో రికార్డు ఛేదనలో సన్‌రైజర్స్ చతికిల పడింది. రాజస్థాన్ స్టార్ పేసర్ ఆర్చర్ అద్భుత బౌలింగ్‌లో హైదరాబాద్‌ను వణకించాడు.

More Stories
ప్రధాని మోదీని కలిసిన తమిళనాడు సీఎం విజయ్
బిఎస్ఎఫ్ కు 142.79 ఎకరాల భూమి అప్పగింత
50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు టిఎంసిని వీడనున్నారా?