రష్యా సైన్యంలోని 49 మంది భార‌తీయులు మృతి 

రష్యా  సైన్యంలోని 49 మంది భార‌తీయులు మృతి 
ర‌ష్యా సైనిక ద‌ళంలో ప‌నిచేస్తున్న 49 మంది భార‌తీయ‌లు ఉక్రెయిన్‌తో జ‌రుగుతున్న యుద్ధంలో మృతిచెందిన‌ట్లు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ర‌ష్యా ద‌ళంలో మొత్తం 217 మంది భార‌తీయులు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిపై ఓ నివేదిక‌ను సుప్రీంకోర్టుకు ప్ర‌భుత్వం అంద‌జేసింది. 
 
ఆ నివేదిక ప్ర‌కారం ర‌ష్య‌న్ ఆర్మీలో చేస్తున్న సుమారు 139 మంది భార‌తీయులను కాంట్రాక్టు నుంచి త‌ప్పించిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో 49 మంది భార‌తీయులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆ రిపోర్టులో పేర్కొన్నారు. ర‌ష్యా వైపు ఆరుగురు భార‌తీయ సైనికులు మిస్సింగ్‌లో ఉన్నారు. మ‌రో 23 మంది ఎక్క‌డ ఉన్నారో స్ప‌ష్టంగా తెలియ‌దు. 
 
మాస్కోలో ఉన్న భార‌తీయ ఎంబ‌సీ వారి కోసం అన్వేష‌ణ కొన‌సాగిస్తుంద‌ని ఆ రిపోర్టులో చెప్పారు. విదేశాంగ శాఖ స‌మాచారం ప్ర‌కారం.. 217 మంది భార‌తీయులు ర‌ష్యా సైనిక ద‌ళంలో చేరిన‌ట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబాల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని ఓ పిటీష‌న‌ర్ కోర్టులో కోరారు. 
 
ర‌ష్యా 26 మంది భార‌తీయుల్ని త‌మ ఆధీనంలో ఉంచుకుంద‌ని, వారిని ఉక్రెయిన్‌తో వార్‌లో పోరాడేలా వ‌త్తిడి చేస్తోంద‌ని, వారిని ఎలాగైన భార‌త్‌కు తీసుకురావాల‌న్న డిమాండ్ పెరిగింది. ఈ నేప‌థ్యంలో దాఖ‌లైన పిటీష‌న్‌పై ప్ర‌భుత్వం స్పందించింది. సుమారు 21 మంది బాధిత కుటుంబీకుల డీఎన్ఏ శ్యాంపిళ్ల‌ను ర‌ష్యా అధికారుల‌కు పంపిన‌ట్లు అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఐశ్వ‌ర్య భాటి సీజే సూర్య‌కాంత్‌కు తెలిపారు.