పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్నూ జిల్లాలోని ఫతేఖేల్ పోలీస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన భారీ ఆత్మాహుతి దాడిలో 15 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పాక్‌లోని పాకిస్తానీ తాలిబాన్‌తో సంబంధాలు కలిగిన ‘ఇత్తెహాద్-ఉల్-ముజాహిదీన్’ అనే వేగంగా విస్తరిస్తున్న ఇస్లామిస్ట్ మిలిటెంట్ కూటమి, ఈ దాడికి బాధ్యత వహించింది. ఇత్తెహాద్-ఉల్ -ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.
పేలుడు ధాటికి సమీపంలోని నివాస గృహాలు కుప్పకూలడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో పోలీస్ స్టేషన్‌ను శనివారం అర్ధరాత్రి ఉగ్రవాదులు పేల్చివేయనున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ వాహనాన్ని గుర్తించి, మార్గం మధ్యలోనే ధ్వంసం చేయడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఈ బాంబు దాడుల్లో సుమారు 15మంది మరణించారని, గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించామని ఉన్నతాధికారులు ఆదివారం తెలిపారు. వాయువ్య పాకిస్థాన్ లోని ఒక పోలీస్ పోస్ట్ వద్ద, ఆ తర్వాత సహాయం అందించేందుకు వెళ్తున్న పోలీస్ సిబ్బంది వాహనంపై మెరుపు దాడులు జరిగాయి. ముందుగా భారీ పేలుడు జరిగిందని, తరువాత ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్‌ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి కాల్పులు జరిపారని, భద్రతా సిబ్బంది అప్రమత్తమై ప్రతి దాడి చేశారన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న 15 మంది పోలీసులు మరణించారు. వాహనంలో పేలుడు పదార్థాలు భారీగా ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది పోలీసులు చాలా దూరం ఎగిరిపడ్డారు. కొందరు పోలీసులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక చర్యలు చేపడుతూ శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి మృతదేహాల్ని బయటకు తీశారు. ఈ ఘటనతో అక్కడి నిర్మానం పూర్తిగా కూలిపోయింది. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
రాత్రంతా సహాయక చర్యలు చేపట్టినట్లు స్థానిక డీఐజీ సజ్జాద్ ఖాన్ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఆత్మాహుతి దాడిలో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో చుట్టుపక్కల చాలా దూరం వరకు నివాసాలు, ఇతర బిల్డింగులు కూడా ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు. కొన్ని చోట్ల పేలుడు తీవ్రతకు ఇంటి పైకప్పులు కూడా కూలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సహాయక చర్యలు చేపడుతుండగా, ఉగ్రవాదులు మళ్లీ దాడి చేసే అవకాశం ఉందన్న భయంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.
పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, దేశం తన భద్రతా దళాలతో భుజం భుజం కలిపి నిలబడుతుందని తెలిపారు. “ఉగ్రవాదుల దుష్ట ఉద్దేశాలను ఓడిస్తాం,” అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో వివిధ సాయుధ గ్రూపుల దాడులు సర్వసాధారణం. ఫిబ్రవరిలో రాజధాని ఇస్లామాబాద్‌లోని ఒక మసీదుపై ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ జరిపిన ఆత్మాహుతి దాడిలో డజన్ల కొద్దీ ప్రజలు మరణించగా, 160 మందికి పైగా గాయపడ్డారు.

More Stories
ఎబివిపికి సైద్ధాంతిక స్పష్టత, సంస్థాగత దార్శనికత అందించిన కేల్కర్
ప్రతిపక్షాల ఐక్యతకై మమతా పిలుపును తిరస్కరించిన కాంగ్రెస్, లెఫ్ట్
తెలంగాణలో ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే