సాధారణంగా ఎంఎంటీఎస్ సేవల ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి పది కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఉచిత ప్రయాణం అమలు చేయడం వల్ల రైల్వేకు కలిగే ఈ లోటును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. ప్రయాణికుల సంఖ్య పెరిగినా సరే ఆ ఖర్చును భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఉన్న తక్కువ ప్రయాణికుల సంఖ్యను మళ్లీ పెంచి, రైళ్లను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రైల్వే బోర్డుతో చర్చలు జరిపింది.
కేవలం ఉచిత ప్రయాణమే కాకుండా రైల్వే స్టేషన్ల వద్ద కనెక్టివిటీ పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఆర్టీసీ ద్వారా ప్రత్యేక షటిల్ బస్సులను నడపాలని నిర్ణయించింది. ప్రయాణికులు స్టేషన్ నుంచి తమ ఇళ్లకు సులభంగా వెళ్లేలా ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో అదనపు రైళ్లు నడపాలని కూడా రైల్వే శాఖను కోరారు. స్టేషన్లలో మౌలిక వసతులు పెంచి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సరికొత్త రవాణా విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

More Stories
భగీరథ్ కేసులో ఆర్ఎస్ఎస్ పై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు
తెలుగు రాష్ట్రాల జలవివాదాలు పరిష్కారంకు కేంద్రం ఫార్ములా!
వరంగల్ జంట హత్యల కేసులో మరణ శిక్ష