ఈపీఎఫ్ సభ్యులకు ప్రయోజనం చేకూరేలా కొత్త ప్రతిపాదనలు, మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈపీఎఫ్ కనీస పెన్షన్ ఏడు రెట్లు పెరగనుంది. ఇటీవల ప్రతిపాదించిన ఏటీఎం విత్‌డ్రాయల్స్ సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనిపై ఇప్పటికే ఈపీఎఫ్‌ఓ పని చేస్తోంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ఇకపై సభ్యులు ఆలస్యం లేకుండా వేగంగా, సులభంగా తమ డబ్బులు విత్ డ్రా చేసుకో
ప్రస్తుతం ఈపీఎఫ్ సభ్యులకు అందిస్తున్న కనీస పెన్షన్ రూ.1,000 నుంచి రూ.7,500కు పెరగనుంది. ఈపీఎఫ్–95 ప్రతిపాదనలో భాగంగా కనీస పెన్షన్ పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఈ అంశంపై ఎప్పటినుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. పలు లేబర్ యూనియన్లు కూడా కనీస పెన్షన్ స్కీంలో మార్పులు తేవాలని కేంద్రాన్ని కోరుతున్నాయి.
గతంలో పార్లమెంటరీ కమిటీ కూడా దీనిపై ప్రతిపాదన చేసింది. సభ్యులకు కనీస పెన్షన్ పెంచాలని సూచించింది.
దీనిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతోపాటు వడ్డీ రేట్లు కూడా పెంచాలనే ప్రతిపాదన ఉంది. సభ్యులకు ఏడాదికి 8.25 శాతం వడ్డీ అందించాలని లేబర్ యూనియన్లు కోరుతున్నాయి. దీనిపై కూడా కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే వెంటనే వడ్డీ సభ్యుల ఖాతాల్లోకి బదిలీ అవుతుంది. అలాగే, ఈపీఎఫ్ డబ్బును ఏటీఎంల ద్వారా కూడా డ్రా చేసుకునే సౌకర్యం కలగనుంది.
మరోవైపు.. గతంతో పోలిస్తే క్లెయిమ్ సెటిల్‌మెంట్లు కూడా మెరుగైనట్లు ఈపీఎఫ్‌ఓ సంస్థ వెల్లడించింది. 2025–26లో 8.31 కోట్ల క్లెయిమ్స్ సెటిల్ అయ్యాయి. అంతకుముందు ఇది 6.01కోట్ల క్లెయిమ్స్‌గా ఉంది. ఆటోమేషన్ ప్రాసెస్ మెరుగుపర్చడం ద్వారా సెటిల్‌మెంట్లు త్వరగా జరుగుతున్నాయి. 71.11 శాతం అడ్వాన్స్ క్లెయిమ్స్ మూడు రోజుల్లోనే జరిగాయి. డిజిటల్ ప్రాసెస్ మెరుగుపర్చడం వల్ల ఈపీఎఫ్‌ఓ క్లెయిమ్స్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.
ఈపీఎఫ్ మెంబర్ల కోసం కేంద్రం కొత్తగా ఈ ప్రాప్తి పోర్టల్ లాంచ్చేసింది. దీని ద్వారా కొంతకాలంగా వినియోగంలోలేని అకౌంట్లను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు.

More Stories
భారత్ కు ప్రత్యేక మార్గంలో యూఏఈ చమురు
ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ఆలోచన లేదు
పెరిగిన ఇంధనం ధరలతో విమానాలు నడపలేం!