పత్తి ఎగుమతుల్లో తగ్గుదల కారణంగా 2025-26లో దేశీయ వస్త్ర ఎగుమతులు 2.2 శాతానికి తగ్గి 35.8 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ప్రపంచ వాణిజ్య పరిశోధన సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జిటిఆర్ఐ) అనే థింక్ ట్యాంక్ శనివారం వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం కూడా ఎగుమతులు వస్త్ర ఎగుమతులు 2.1 శాతానికి తగ్గాయి. ప్రధాన రంగాలైన పత్తి వస్త్రాలు (-3.9), రెడిమేడ్ దుస్తులు (-1.4 శాతం), తివాచీలు (-5.3 శాతం) ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు తగ్గాయి.
అయితే ఈ సంవత్సరంలో హస్తకళల రంగం మాత్రం 1.5 శాతంతో స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడంతో ఎగుమతులు క్షీణించాయని జిటిఆర్ఐ అంచనా వేసింది. కాగా, భారతదేశం దేశీయంగా విలువ పరంగా ఎక్కువగా ఎగుమతి చేస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా తక్కువ డాలర్లను ఆర్జిస్తోందని ఈ సంస్థ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు. ఉదాహరణకు వస్త్రాల ఎగుమతుల్లో రూపాయల్లో 3.6 శాతం పెరుగుదల ఉంది.
కానీ డాలర్లలో చూస్తే 0.8 తగ్గుదల చూపిస్తుంది. గార్మెట్స్ ఎగుమతులు 2.9 శాతం ఉన్నప్పటికీ, డాలర్లలో 1.4 శాతం తగ్గుదల ఉంది. కేవలం భారత కరెన్సీ క్షీణించడమే దీనికి కారణమని ఆయన తెలిపారు. దీనివల్ల భారత్ ప్రపంచ మార్కెట్లలో, ముఖ్యంగా శ్రామిక కేంద్రీకృత రంగాల్లో తన వాటాను కోల్పోతుందని ఆయన ఆందోళన చెందారు.
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, లాజిస్టిక్స్ మెరుగుదలలు, వాణిజ్య సౌలభ్యం వంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, కీలక రంగాలలో స్తబ్దత లేదా క్షీణత ఉన్నట్లు గణాంకాలు చూపిస్తున్నాయి. సంస్కరణల వల్ల ఎగుమతులు వృద్ధి లేదు ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం వీటిపై తక్షణమే ఆలోచించి చర్యలు చేపట్టాలి అని ఆయన పేర్కొన్నారు.

More Stories
పిడిఎస్ స్కామ్ కేసులో బెంగాల్ లో ఈడీ సోదాలు
పేటియం పేమెంట్ బ్యాంక్ రద్దు
వేసవి రద్దీకి 18వేల సమ్మర్ స్పెషల్ రైళ్లు