తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఎన్నికల బరిలోకి దిగిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లలో ఆస్తుల వివరాలకు సంబంధించి భారీ వ్యత్యాసం ఉందంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు దీనిపై స్పందించాలని ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది.
పార్టీ స్థాపించి తొలిసారి ఎన్నికల రణరంగంలోకి దూకిన విజయ్‌కు ఇది గట్టి ఎదురు దెబ్బ కాగా, అంతా షాక్ అవుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా విజయ్ రెండు నియోజకవర్గాలు (తిరుచ్చి ఈస్ట్, పెరంబూరు) నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ రెండు చోట్లా ఆయన సమర్పించిన అఫిడవిట్లలోని ఆస్తుల వివరాల్లో భారీ తేడాలు ఉన్నట్లు చెన్నైకి చెందిన వి. విఘ్నేశ్ అనే ఓటరు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యంగా తిరుచ్చిలో సమర్పించిన అఫిడవిట్ పత్రాల్లో విజయ్ తన ఆదాయం రూ. 220 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే పెరంబూర్‌లో సమర్పించిన అఫిడవిట్లో ఆ ఆస్తుల విలువ రూ. 115 కోట్లుగా చూపించారు. అంటే కేవలం కొన్ని రోజుల వ్యవధిలో దాఖలైన రెండు అఫిడవిట్ల మధ్య సుమారు రూ. 105 కోట్ల వ్యత్యాసం ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇలా ఎందుకు తేడా చూపించాల్సి వచ్చిందో వివరించేలా ఎలాంటి అనుబంధ పత్రాలు, వివరణలను విజయ్ సమర్పించలేదని పిటిషనర్ ఆరోపించారు. కాగా వచ్చేవారం దీనిపై తదుపరి విచారణ జరగనుంది.

More Stories
జడ్జిని తప్పించాలన్న కేజ్రీవాల్ పిటిషన్ కొట్టివేత
నాసిక్ టీసీఎస్ కేసులో నిదా ఖాన్‌కు కోర్టులో చుక్కెదురు
డిజిటల్ అరెస్టు కుంభకోణాలు ప్రాణాంతకమైన సైబర్ నేరాలు