కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి `దురంధర్ ది రివేంజ్’ సినిమాను ఆదివారం నెక్లెస్ రోడ్ ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్లో పార్టీ కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ సినిమాను డైరెక్టర్ ఆదిత్య ధర్ ఆధునిక సాంకేతికతతో అద్భుతంగా తెరకెక్కించారని, దేశానికి సేవ చేస్తున్న భారతీయుల గాథను కళ్లకు కట్టినట్టు చూపించారని ఆయన కొనియాడారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశం కోసం సైనికులు, ప్రతినిధులు, దేశం సరిహద్దులను కాపాడటం కోసం, దేశాన్ని శత్రువుల నుంచి కాపాడటం కోసం ఎలాంటి త్యాగాలు చేస్తున్నారో ఈ సినిమాలో ఆదిత్య అద్భుతంగా చూపించారని ప్రశంసించారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ మన దేశాన్ని ఎలా విచ్చిన్నం చేయాలని, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు దొంగ నోట్లను తయారు చేసిందో, ఉగ్రవాదులను ఎలా పెంచి పోషించిందో అర్థమయ్యేలా సినిమాలో చూపించారని తెలిపారు. మన దేశంలోనే అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటుందో, దేశ సమగ్రతను దెబ్బ తీసేందుకు ఎలా ప్రయత్నిస్తుందో అర్థం అయ్యేలా సినిమాలో వివరించారని చెప్పారు.
దేశ రక్షణ కోసం భద్రతా సిబ్బంది ఇలా పనిచేస్తుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి సూచించారు. దేశ రక్షణ విషయంలో ప్రజల బాధ్యతను ఈ సినిమా గుర్తు చేసిందని తెలిపారు. భవిష్యత్తులో మన దేశంపై పాకిస్తాన్ చేసే కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని చెబుతూ మన దేశం నుంచి విడిపోయి శాశ్వత శత్రువును సృష్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమాలోని నటులు తమ పాత్రల్లో జీవించారని చెబుతూ సినిమా డైరెక్టర్ ఆదిత్య కు యావత్తు భారతదేశం ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా దేశ రక్షణ విషయంలో కలసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ భద్రతా సిబ్బందికి అండగా నిలవాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పిలుపిచ్చారు. దేశ రక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలకు బాసటగా నిలుద్దామని చెప్పారు.

More Stories
సైబరాబాద్, మల్కాజిగిరి కార్పోరేషన్లకు రూ 500 కోట్లు ఏమైన్నట్లు!
హైడ్రా పేరుతో గిరిజన ఇళ్లపై దాడి
తరతరాలుగా స్ఫూర్తిని అందిస్తున్న ఓ పవిత్ర భూమి కందకుర్తి