లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులతో కాల్పుల విరమణపై అనిశ్చితి

లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులతో కాల్పుల విరమణపై అనిశ్చితి

* హర్మూజ్ జలసంధి మళ్లీ మూసివేత?

పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కన్నుల విరమణపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. రెండు వారాల పాటు యుద్ధ విరమణకు ఇరుదేేశాలు అంగీకరించినప్పటికీ, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో హర్మూజ్​ జలసంధి ద్వారా చమురు ట్యాంకర్ల రాకపోకలను నిలిపివేసినట్లు ఇరాన్​ అధికార మీడియా కథనాలు పేర్కొన్నాయి.

హొర్ముజ్‌ జలసంధిలో నౌకల ప్రయాణాన్ని ఇరాన్‌ అడ్డుకోవడంతో బుధవారం అనేక నౌకలు జలసంధిలో చిక్కుకుపోయాయని షిప్పింగ్‌ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్‌ వార్తాసంస్థ తెలిపింది. జలమార్గం ఇప్పటికీ మూతపడే ఉందని పేర్కొంటూ ఇరాన్‌ నేవీ నుంచి జలసంధిలో చిక్కుకున్న నౌకలకు నోటిఫికేషన్లు అందినట్లు వార్తాసంస్థ తెలిపింది.
హెజ్​బొల్లాపై దాడులు పెరగడం ఇరాన్‌ను ఆగ్రహానికి గురి చేసిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ప్రకటించిన సీజ్‌ఫైర్ ఒప్పందం మంగళవారం ప్రారంభమైనప్పటికీ, అది అన్ని ప్రాంతాలకు వర్తించదని స్పష్టం చేశారు. అలాగే, లెబనాన్​ ఈ ఒప్పందంలో భాగం కాదని ఆయన పేర్కొన్నారు.   లెబనాన్‌‌లో హజ్బెల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ బుధవారం కూడా భీకర దాడులను కొనసాగించింది. 10 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 100 వైమానిక దాడులు జరిపింది. 1982 తర్వాత లెబనాన్‌పై ఇదే అతి పెద్ద దాడి అని అధికారులు తెలిపారు.
మరోవైపు, ఇరాన్‌లోని ఓ చమురు శుద్ధి కేంద్రంపై దాడులు జరగ్గా.. దీనికి ప్రతిగా కువైట్‌, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌పై ఇరాన్‌ డ్రోన్లతో విరుచుకుపడింది.  దీనిపై ఇరాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కాల్పుల విరమణ ప్రకటన చేసినా లెబనాన్‌ను ఇప్పటికీ లక్ష్యంగా చేసుకోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇస్తూ  ‘అవును, ఆ ఒప్పందంలో లెబనాన్ లేదు’ అని తెలిపారు. హెజ్బొల్లా కారణంగా వారిని ఒప్పందంలో చేర్చలేదని, దాని గురించి కూడా చూసుకుంటామని ట్రంప్ చెప్పారు.

కాగా,  టెహ్రాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌లో పాలన మార్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌ భవిష్యత్తులో ఆ దేశంతో కలిసి పనిచేయడానికి అమెరికా సన్నద్ధమవుతోందని తెలిపారు.  ఇరాన్‌లో ఇకపై యురేనియం శుద్ధి కార్యక్రమాలు జరగవని ట్రంప్‌ తేల్చిచెప్పారు. ఇరాన్‌ అణు కేంద్రాల శిథిలాల కింద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను వెలికితీస్తామని చెప్పారు. ఇరాన్‌లోని అణు కేంద్రాలు తమ నిఘా నీడలో ఉన్నాయని పేర్కొన్నారు.  

 ఇరాన్‌తో యుద్ధంలో తాము నిర్దేశించిన అన్ని లక్ష్యాలను చేరుకున్నామని, ఇరాన్‌తో ఇక ముప్పు లేదని పేర్కొంటూ  శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్‌ తమకు అప్పగించకపోతే మళ్లీ దాడులు చేపడతామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు.