జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సిఇఆర్టి)ని అధికారికంగా ‘స్వయంప్రతిపత్తి యూనివర్శిటీ హోదా(డీమ్డ్ టు బి యూనివర్శిటీ)’ ప్రకటించారని అధికారులు తెలిపారు. దీంతో ఎన్సిఇఆర్టి స్వయంగా డిగ్రీలను ఇచ్చే అధికారాన్ని పొందిందని పేర్కొన్నారు.
”యుజిసి సలహా మేరకు విద్యాశాఖ ఎన్సిఇఆర్టిని, దాని ఆరు అనుబంధ విభాగాలతో సహా ఒక ప్రత్యేక వర్గం కింద ‘డీమ్డ్ టు బి యూనివర్శిటీ’ గా ప్రకటించింది” అని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఆరు అనుబంధ విభాగాల్లో అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూరు, షిల్లాంగ్ల్లోని ప్రాంతీయ విద్యా సంస్థలు, అలాగే భోపాల్లోని పండిట్ సుందర్లాల్ శర్మ కేంద్ర వృత్తివిద్యా సంస్థలు ఉన్నాయి.
పాఠశాల విద్యకు సంబంధించిన అత్యున్నత సంస్థగా ఎన్సిఇఆర్టి విద్యా పరిశోధన, ఆవిష్కరణలు, పాఠ్య ప్రణాళిక రూపకల్పన, పాఠ్యపుస్తకాలు, బోధన-అభ్యాసం మెటీరియల్స్ సహా పలు కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
మూడేళ్ల క్రితం, ‘డి నోవో’ కేటగిరీ కింద ఎన్సిఇఆర్టికి ‘డీమ్డ్ టు బి యూనివర్శిటీ’ హోదా కల్పించాలని కేంద్రం ప్రతిపాదించింది. డీనోవో డీమ్డ్ యూనివర్శిటీ అనేది ఒక కొత్త సంస్థను డీమ్డ్ టు బి యూనివర్శిటీగా స్థాపించడానికి యుజిసి దరఖాస్తు చేసుకోగల ఒక సంస్థ. ఇది ఇప్పటికే ఉన్న ఏ సంస్థ అందించని ప్రత్యేకమైన, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో అధ్యయనం, పరిశోధన చేపడుతుంది.

More Stories
53 ఏళ్ల తర్వాత చంద్రుడి వద్దకు మళ్ళీ మానవుడు
బీహార్ గుడిలో తొక్కిసలాట.. 8 మంది మహిళలు మృతి
2.37 లక్షలకు పైగా ఓటర్లకు ఇంటి వద్దే ఓటు సౌకర్యం