క్రిమియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రష్యాకు చెందిన సైనిక విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 29 మంది దుర్మరణం చెందారు. ఆంటోనోవ్ – 26 మోడల్‌కు చెందిన విమానం మంగళవారం సాయంత్రం 6 గంటల (స్థానిక కాలమాన ప్రకారం )కు క్రిమియా ద్వీపకల్పం మీదుగా వెళ్తోంది. అదే సమయంలో ఆ విమానానికి రాడర్‌తో సంబంధాలు తెగిపోయాయి. అయితే ఆ విమానం ఒక కొండను ఢీకొని కూలిపోయినట్లు తెలుస్తుంది.
ప్రమాద సమయంలో విమానంలో 23 మంది సైనికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా వారందరూ మృతిచెందారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సాంకేతిక సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా వేసింది. “మార్చి 31న మాస్కో కాలమానం ప్రకారం సుమారు 18:00 గంటలకు, క్రిమియా ద్వీపకల్పం మీదుగా షెడ్యూల్ ప్రకారం ప్రయాణిస్తున్న ఆన్-26 సైనిక రవాణా విమానంతో సంబంధాలు తెగిపోయాయి,” అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
“గాలింపు, సహాయక బృందం ఆన్-26 విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించింది. సంఘటనా స్థలం నుండి అందిన నివేదికల ప్రకారం, విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు మరణించారు,” అని మంత్రిత్వ శాఖ తెలిపింది. విమానంపై దాడి జరిగింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది.
ప్రమాదానికి గురైన ఆంటోనోవ్ ఎన్- 26 విమానాలను 1960 చివరలో ప్రవేశపెట్టారు. వీటని సైనిక అవసరాలతో పాటు సరుకు రవాణాకు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ మోడల్‌కు చెందిన విమానాలు గత కొన్నేళ్లుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇదే ఏడాది దక్షిణ సూడాన్‌లో జరిగిన ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 2022లో ఉక్రెయిన్‌లో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 2020లో శిక్షణ విమానం కూలి 20 మంది మరణించారు.

More Stories
ఇరాన్‌పై బంకర్ బ్లస్టర్లు.. ఆయుధ డిపోల పేల్చివేత
హర్మూజ్ జలసంధిలో నౌకలకు ఇరాన్ టోల్ ఫీజు
పాలస్తీనియన్లు ఉగ్రదాడులకు పాల్పడితే మరణదండనే