హైదరాబాద్లో గతంలో జరిగిన అభివృద్ధి కూడా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో, అప్పటి ఎన్డీయే-టీడీపీ ప్రభుత్వ కాలంలో రూపొందించిన ప్రణాళికలు, కార్యక్రమాల ఆధారంగానే జరిగిందని తెలిపారు. కానీ బీఆర్ఎస్ గాని, ఇప్పుడు కాంగ్రెస్ గాని హైదరాబాద్ అభివృద్ధికి గణనీయంగా చేసిందేమీలేదని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ పరిసరాల్లో నిర్మించబడిన అనేక జాతీయ రహదారులు, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు.. ఇవన్నీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రధాన కృషి అని చెప్పారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెల్ఫోన్ తయారీ పరిశ్రమలు, రక్షణ రంగానికి చెందిన పరిశ్రమలు వంటి అనేక పరిశ్రమలు స్థాపిస్తున్నారని గుర్తు చేసారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అయిన మేక్ ఇన్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి కార్యక్రమాల ఫలితంగా వస్తున్నాయని, ఈ పథకాల ద్వారా పరిశ్రమలు ఏర్పడుతూ, యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.
తెలంగాణలో ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓంకారేశ్వర ఆలయం నిర్మాణం గురించి మాట్లాడుతుంటారని, మరోవైపు హిందూ దేవతలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేస్తారని ధ్వజమెత్తారు. ఒకవైపు ఆలయాల పేరుతో భక్తి చూపిస్తున్నట్టు నటిస్తూ, మరోవైపు “ముస్లిం కాంగ్రెస్… కాంగ్రెస్ ముస్లిం” అంటూ మత రాజకీయాలను ప్రోత్సహించడం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.

More Stories
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు
నల్సార్ యూనివర్సిటీలో గంజాయి కలకలం
తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలు