హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఎస్‌సి హోదాకు అర్హులు

హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఎస్‌సి హోదాకు అర్హులు

హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఎస్‌సి హోదాను పొందగలరన్న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. క్రైస్తవ మతం సహా ఒక వ్యక్తి ఏ మతంలోకి మారినా, ఎస్‌సి కమ్యూనిటీ సభ్యులకు లభించే ప్రయోజనాలను పొందలేరని పేర్కొంది. ”హిందూ మతం కాకుండా వేరే మతాన్ని అనుసరించే ఏ వ్యక్తి కూడా షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వ్యక్తిగా పరిగణించబడరు” అని నిర్దేశించే రాజ్యాంగ (షెడ్యూల్డ్‌ కులాలు) ఉత్తర్వు, 1950లోని క్లాజ్‌ 3ను జస్టిస్‌ పి.కె.మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పులో ప్రస్తావించింది. ఈ నిబంధన కింద ఉన్న పరిమితి సంపూర్ణమైనదని పేర్కొంది. 

1950లోని క్లాజ్‌ 3లో పేర్కొనబడని ఏ మతంలోకి అయినా ఎస్‌సి సభ్యుడు మారితే, అతను రిజర్వ్‌ కేటగిరీ హోదాను కోల్పోవడానికి దారితీస్తుందని కోర్టు పేర్కొంది. క్రైస్తవమతంలోకి మారిన ఎస్‌సి వ్యక్తి, షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల (అత్యాచారాల నివారణ) చట్ట ఉల్లంఘన జరిగిందని వాదించలేరని తెలిపింది. క్రైస్తవమతంలోకి మారి, ప్రస్తుతం పాస్టర్‌గా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి, తనపై దాడికి పాల్పడ్డారంటూ కొంతమంది వ్యక్తులపై షెడ్యుల్డ్‌ కులాల, షెడ్యూల్డ్‌ తెగల (అత్యాచారాల నివారణ) చట్ట కింద దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది.

“1950 నాటి ఉత్తర్వులోని క్లాజ్ 3 ప్రకారం షెడ్యూల్డ్ కుల సభ్యునిగా పరిగణించబడని ఏ వ్యక్తి అయినా, రాజ్యాంగం లేదా పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ చట్టం కింద ఎలాంటి చట్టబద్ధమైన ప్రయోజనం, రక్షణ, రిజర్వేషన్ లేదా అర్హతను పొందలేరు లేదా వారికి వర్తింపజేయబడదు. ఈ నిషేధం సంపూర్ణమైనది. దీనికి ఎలాంటి మినహాయింపు లేదు. ఒక వ్యక్తి క్లాజ్ 3లో పేర్కొన్న మతం కాకుండా వేరొక మతాన్ని ఏకకాలంలో పాటిస్తూ, షెడ్యూల్డ్ కుల సభ్యత్వాన్ని క్లెయిమ్ చేయలేరు,” అని ధర్మాసనం పేర్కొంది.

“పిటిషనర్ క్రైస్తవ మతం నుండి తన అసలు మతంలోకి తిరిగి మారారని గానీ, లేదా మాదిగ సమాజంలోకి తిరిగి అంగీకరించబడ్డారని గానీ అతని వాదన కాదు. దీనికి విరుద్ధంగా, అప్పీలుదారుడు క్రైస్తవ మతాన్ని పాటిస్తూనే ఉన్నారని, దశాబ్దానికి పైగా గ్రామ పాస్టర్‌గా పనిచేస్తూ, గ్రామంలోని ఇళ్లలో క్రమం తప్పకుండా ఆదివారం ప్రార్థనలు నిర్వహిస్తున్నారని సాక్ష్యాధారాలు రుజువు చేస్తున్నాయి” అని ధర్మాసనం గుర్తుచేసింది. 

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం, 2015 కింద, అక్కాల రామి రెడ్డి, ఇతరులపై ఒక క్రైస్తవ పాస్టర్, పాస్టర్ చింతడ ఆనంద్ పాల్ ఫిర్యాదు చేయడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ కేసు నమోదైంది. తనపై కులపరమైన దూషణలు, చంపేస్తామని బెదిరింపులు జరిగాయని ఆయన ఆరోపించారు. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈ విధంగా తీర్పు ఇచ్చింది: 

“వాస్తవ ఫిర్యాదిదారుడు పిట్టలవానిపాలెం మండలంలోని పాస్టర్స్ ఫెలోషిప్‌కు కోశాధికారిగా పనిచేస్తున్నారు. పాస్టర్ కావాలంటే తప్పనిసరిగా క్రైస్తవ మతంలోకి మారాలి. స్పష్టంగా, రెండవ ప్రతివాది (చింతడ ఆనంద్ పాల్) ఒక క్రైస్తవుడు. క్రైస్తవ మతంలోకి మారినందున, పిటిషనర్ షెడ్యూల్డ్ కుల వర్గంలో సభ్యుడిగా కొనసాగలేరు”. కుల వ్యవస్థ క్రైస్తవ మతానికి విరుద్ధమైనది. క్రైస్తవ మతంలోకి మారి, ఒక చర్చిలో పాస్టర్‌గా తన పాత్రను అంగీకరించినందున, రెండవ ప్రతివాది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టంలోని నిబంధనలను ప్రయోగించలేరు. 

“వాస్తవ ఫిర్యాదిదారుడు పిట్టలవానిపాలెం మండలంలోని పాస్టర్స్ ఫెలోషిప్‌కు కోశాధికారిగా పనిచేస్తున్నారు. పాస్టర్ కావాలంటే తప్పనిసరిగా క్రైస్తవ మతంలోకి మారాలి. స్పష్టంగా, రెండవ ప్రతివాది (చింతడ ఆనంద్ పాల్) ఒక క్రైస్తవుడు. క్రైస్తవ మతంలోకి మారినందున, పిటిషనర్ షెడ్యూల్డ్ కుల వర్గంలో సభ్యుడిగా కొనసాగలేరు” అని హైకోర్టు ఏకధర్మం నిర్ధారించింది.

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం, 1989 అనేది “షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సభ్యులపై జరిగే అత్యాచారాలను నివారించడానికి ప్రవేశపెట్టిన ఒక రక్షణాత్మక చట్టం” అని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుత కేసులో, రెండవ ప్రతివాది చట్టంలోని నిబంధనలను అమలు చేయడానికి అర్హత లేనప్పటికీ, రక్షణ చట్టాన్ని దుర్వినియోగం చేశారు. 

సంఘటన జరిగిన తేదీ నాటికి, రెండవ ప్రతివాది స్వచ్ఛందంగా క్రైస్తవ మతంలోకి మారి, గత 10 సంవత్సరాలుగా ఒక చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నట్లు అంగీకరించారు. అందువల్ల, రక్షణ చట్టంలోని నిబంధనలను అమలు చేయడానికి రెండవ ప్రతివాదిని అనుమతించలేము. రెండవ ప్రతివాది ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నివారణ) చట్టాన్ని దుర్వినియోగం చేసి, తప్పుడు ఫిర్యాదు దాఖలు చేశారని హైకోర్టు పేర్కొంది. 

“రెండవ ప్రతివాది ఎస్సీ సర్టిఫికేట్‌ను కలిగి ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది చేసిన వాదనకు సంబంధించి, ఇది ఆంధ్రప్రదేశ్ (షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు) కమ్యూనిటీ సర్టిఫికేట్ల జారీ నియంత్రణ చట్టం, 1993లోని సెక్షన్ 5 కింద, ఆ చట్టం ప్రకారం సంబంధిత అధికార సంస్థ ద్వారా పరిష్కరించాల్సిన విష యం,” అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. 

క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి, అధికార యంత్రాంగం కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయనంత మాత్రాన, రక్షణ చట్టం కింద కల్పించిన రక్షణ లభించదు. రెండవ ప్రతివాది క్రైస్తవ మతంలోకి మారిన రోజే షెడ్యూల్డ్ కుల వర్గానికి చెందిన వ్యక్తిగా ఉండటం మానేశారని హైకోర్టు స్పష్టం చేసింది.