* ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం సమీపంలో ఇరాన్ క్షిపణి దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడుల వల్ల అమెరికా సైన్యం ఊహించని రీతిలో భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. యుద్ధం ప్రారంభమైన కేవలం మొదటి రెండు వారాల్లోనే గల్ఫ్ రీజియన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన దాడుల కారణంగా 800 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,7000 కోట్లు) నష్టం వాటిల్లినట్లు బీబీసీ,సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సిఎస్ఐఎస్) తమ నివేదికల్లో వెల్లడించాయి.
ఈ దాడుల్లో అత్యధిక నష్టం జోర్డాన్‌లోని అమెరికా సైనిక బేస్‌కు వాటిల్లింది. ఇక్కడ అత్యాధునికమైన రాడార్ వ్యవస్థ లక్ష్యంగా ఇరాన్ దాడులు చేయడంతో, అది తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ ఒక్క రాడార్ వ్యవస్థ విలువే దాదాపు 485 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్ జరిపిన నాలుగో బాలిస్టిక్ క్షిపణి దాడిలో, మధ్య ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి క్లస్టర్ ఆయుధాలను జారవిడవడంతో 15 మంది గాయపడ్డారని, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పారామెడిక్స్ తెలిపారు. ఈ క్షిపణి టెల్ అవీవ్, సమీప నగరాల్లోని విశాలమైన ప్రాంతంలో చిన్న బాంబులను వెదజల్లింది.
అమెరికా రక్షణ వ్యవస్థలో కీలకమైన పరికరాలు ధ్వంసం కావడం ఆ దేశానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అనడోలు సంకలనం చేసిన సమాచారం ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ 12 అమెరికా, దాని మిత్రదేశాల రాడార్ మరియు శాట్‌కామ్ టెర్మినళ్లపై దాడి చేసింది. కువైట్ అధికారుల ప్రకారం, ఆదివారం మూడు ‘శత్రు డ్రోన్లు’ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త రాడార్ వ్యవస్థను దెబ్బతీయడంతో, అది లక్ష్యంగా చేసుకున్న వాటిలో ఒకటిగా ఉంది. నష్టం పూర్తి స్థాయి ఇంకా తెలియరాలేదు.
జోర్డాన్‌తో పాటు కువైట్, ఖతార్, సౌదీ అరేబియాలోని అమెరికా నియంత్రణలో ఉన్న విమానాశ్రయాలు, అత్యంత శక్తివంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థలపైన కూడా దాడులు జరిగాయి. ఈ ప్రాంతాల్లో సుమారు 310 మిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇరాన్ బహ్రెయిన్‌లోని మనామాలో ఉన్న అమెరికా నౌకాదళపు ఐదవ విమానదళ ప్రధాన కార్యాలయంపై కూడా దాడి చేసి, రెండు ఉపగ్రహ సమాచార టెర్మినళ్లను, అనేక పెద్ద భవనాలను ధ్వంసం చేసింది. పశ్చిమాసియాలో అమెరికా వ్యూహాత్మక స్థావరాలను దెబ్బతీయడం ద్వారా ఇరాన్ తన పట్టును నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది.
మరోవంక, ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధనా కేంద్రం ఉన్న డిమోనా నగరంపై ఇరాన్ దాడి చేసింది. శనివారం సాయంత్రం ఇరాన్ ప్రయోగించిన రెండు క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ ఎయిర్ ఢిఫెన్స్ వ్యవస్థ విఫలమైంది. దీంతో భారీగా పేలుడు సంభవించింది. డిమోనా, అరద్లపై ఇరాన్ జరిపిన రెండు క్షిపణుల దాడుల్లో 100 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు.
దేశంలోని దక్షిణప్రాంతపు రెండు ప్రధాన నగరాలపై శత్రువు క్షిపణు దూసుకువచ్చినా తాము పసికట్టలేకపోయామని, వాటిని దెబ్బతీయలేకపోయామని ఇజ్రాయెల్ సైన్యం తమ అశక్తతను అంగీకరించింది. డిమోనా పరిసరాల గగనతలంలోకి తొలిసారిగా ఇరాన్ మిస్సైల్స్ దూసుకురావడంతో దేశ వైమానిక రక్షణ వ్యవస్థ విఫలం అయిందని ఇజ్రాయెల్ సేనలే అంతర్మథనం చెందాయి.
ఇప్పుడు తాము ఇజ్రాయెల్ లోతట్టు ప్రాంతంలోకి దూసుకువెళ్లడం అంటే ఈ పోరులో ఇది అత్యంత మలుపు తిరిగే ఘట్టం అయినట్లే అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మెహ్మద్ బఘేర్ గాలిబాఫ్ అరాద్‌పై దాడికి ముందే స్పందించారు. మరో వైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇకపై జరిపే తమ పోరుకు ఇప్పుడు ఇరాన్ జరిపిన దాడి అత్యంత క్లిష్టమైన సవాలును మిగిల్చిందని వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శత్రు దేశానికి చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించిన ఇరాన్ హోర్ముజ్ ద్వీపం సమీపంలో జరిగిన ఈ సంఘటనకు సాక్ష్యంగా ఒక వీడియో కూడా విడుదల చేసింది. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో భవిష్యత్తులో మరిన్ని సంక్షోభాలకు దారితీసేలా కనిపిస్తున్నాయి.
కాగా, గ్రీన్ లాండ్‌ను అమెరికాలో విలీనం చేసుకోవాలన్న ట్రంప్ ఆకాంక్షను ఇరాన్ తీవ్రంగా ఎద్దేవా చేసింది. అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలకు మద్దతు ఇవ్వడం ద్వారా అగ్రరాజ్యాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్న ఇరాన్ ” గ్రీన్ లాండ్ కోరితే చాలు, వారికి మేము రక్షణగా నిలుస్తాం” అని ప్రకటించింది.

More Stories
బ్రిటిష్ కర్కశంకు నిదర్శనం “బలిదాన దివస్”
ఎబివిపి నిరసనలతో జమ్మూలో జిన్నా పాఠం తొలగింపు!
ముస్లిం దేశాల్లో కూడా రోడ్లపై నమాజ్‌కు అనుమతించరు