శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధార్మిక సదస్సు 

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధార్మిక సదస్సు 
* రాష్ట్రవ్యాప్త సామూహిక స్వచ్ఛంద అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభం 
 
​కర్నూలు జిల్లా, గోనెగండ్ల మండలం, బైలుప్పల గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షికోత్సవం  సందర్భంగా హిందూ ధార్మిక సదస్సు అత్యంత వైభవంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా మార్చి 19 (ఉగాది) నుండి 23 (పంచమి)వరకు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా  నిర్వహించబోయే సామూహిక స్వచ్ఛంద అక్షరాభ్యాస కార్యక్రమంను గన్నవరం భువనేశ్వైరీ పీఠాధీపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామి ప్రారంభించారు. 
 
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ డా. దాసరి శ్రీనివాసులు  తాతగారైన పెద్ద వెంకట దాసు సుమారు 105 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో జరిగిన సదస్సులో  సామూహిక స్వచ్ఛంద అక్షరాభ్యాస కార్యక్రమoలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని  కమలానంద భారతి స్వామి పిలుపునిచ్చారు. బడి – గుడి పున:నిర్మాణం కారణంగా దేశo బలపడాలన్న నినాదంతో, స్థానిక దేవాలయాల కేంద్రంగా హిందూ బంధువులందరూ  అందుకు చేదోడుగా నిలబడాలని కోరారు. 
 
ప్రత్యేకించి  దళితవాడల్లో, మత్స్యకార  గ్రామాలలో 856 పైగా హిందూ దేవాలయాల నిర్మాణాలకు సంబంధించి ప్రత్యేక చొరవ తీసుకుని టిటిడి ఆర్థిక సహాయంతో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యలో చేపట్టిన హిందూ దేవాలయ నిర్మాణాలు మొదలు ధూప దీప నైవేద్యాలు వంటి అనేక ధార్మిక కార్యక్రమాలలో దాసరి శ్రీనివాసులు తీసుకున్న చొరవను స్వామి వారు ప్రస్తావించారు. ​ 

అహోబిలం క్షేత్ర ప్రధాన అర్చకులు రమేష్ స్వామి, వివిధ పుణ్యక్షేత్రాల పెద్దలు పాల్గొని ప్రసంగించారు.  మార్చి 19 నుండి మార్చి 23 వరకు పేద వర్గాల బాల బాలికల విద్య ఆరంభానికి రాష్ట్రం లో నిర్వహించబోయే సామూహిక స్వచ్ఛంద అక్షరాభ్యాస కార్యక్రమాన్ని  ప్రతి హైందవుడు తన సాంస్కృతిక,  సంప్రదాయ బాధ్యత గా భావించాలని  డా. శ్రీనివాసులు అభ్యర్థించారు.

ఈ 105వ వార్షికోత్సవ వేడుకలకు శ్రీశైలం దేవస్థానం తరఫున, అహోబిలం మఠం వారు,ఆదోని శ్రీ  మహా లక్ష్మమ్మ అవ్వ దేవస్థానం వారు, ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్షేత్ర నిర్వాహకులు అందించిన ఆలయ మర్యాదలకు ధన్యవాదాలు తెలియజేశారు.  వెంకట దాసు వంశస్తులు ఈ ఆలయ ప్రధాన అర్చకులుగా నిత్యం దూప దీప నైవేద్యాలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ సందర్భంగా డా.  శ్రీనివాసులు, ఆయన కుటుంబ సభ్యులు  సమీపంలోని తాత, అవ్వలు, మాతృమూర్తి సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.