భారత అమ్ములపొదిలోకి మరిన్ని ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రానున్నాయి. రష్యా తయారీకి చెందిన మిస్సైల్ రక్షణ వ్యవస్థను రెట్టింపు చేసుకోవాలని భారత్ యోచిస్తున్నది. దీనిలో భాగంగా మరో అయిదు కొత్త ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను కొనుగోలు చేసేందుకు భారత్ ఆసక్తిగా ఉన్నది. సుమారు రూ. 63 వేల కోట్ల ఖర్చుతో 5 ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్స్‌ను కొనే ప్రతిపాదనకు రక్షణ శాఖ కార్యదర్శి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదనపు 5 ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్స్‌తో.. భారత్ వాటి సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నది. 2018లో సుమారు 5.4 బిలియన్ల డాలర్లతో 5 ఎస్-400 సిస్టమ్స్‌కు భారత్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటి వరకు మూడు సిస్టమ్స్ డెలివరీ అయ్యాయి. ఈ ఏడాది చివరి వరకు మరో రెండు సిస్టమ్స్ భారత్‌కు అందనున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎస్-400 సిస్టమ్స్ అప్పగింత ఆలస్యం అవుతున్నది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎస్-400 సిస్టమ్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. గత వారం భారతీయ వైమానిక దళం ఎస్-400 సిస్టమ్‌కు చెందిన ఓ వీడియోను కూడా పోస్టు చేసిన విషయం తెలిసిందే.

More Stories
ఎల్ఎన్జి ఉత్పత్తిని నిలిపివేసిన ఖతార్
సముద్రంలో చిక్కుకుపోయిన 70 వేల టన్నుల బాస్మతి బియ్యం
ఇంధన సరఫరాపై భారత్‌కు రష్యా భరోసా