బిజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్‌ను బీహార్ నుండి రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ నిర్ణహించింది. బీహార్ నుండి రాజ్యసభకు నితిన్ నబిన్, శివేష్ రామ్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 5 చివరి తేదీ. మార్చి 15న ఓటింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాన్ని ప్రకటిస్తారు.
మంగళవారం (ఆరు రాష్ట్రాల నుంచి తొమ్మిది మంది రాజ్యసభ అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. అయితే, మహారాష్ట్ర అభ్యర్థుల పేర్లను పార్టీ ఇంకా ఖరారు కాలేదు. హర్యానా నుంచి సంజయ్ భాటియా రాజ్యసభకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హా నామినేట్ అయ్యారు. లక్ష్మీ వర్మ ఛత్తీస్‌గఢ్ నుంచి రాజ్యసభకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన్మోహన్ షమల్, సుజిత్ కుమార్ ఒడిశా నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. తరాష్ గోవాలా, జగన్మోహన్ అస్సాం నుంచి బరిలోకి దిగుతున్నారు.
బీహార్‌కు చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగుస్తుంది. జెడియు తరపున రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్, ఆర్జేడీ తరపున ప్రేమ్‌చంద్ గుప్తా, అమరేంద్ర ధరి సింగ్, రాష్ట్రీయ లోక్ మోర్చా తరపున ఉపేంద్ర కుష్వాహా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే, ఎన్డీయే ఐదు స్థానాల్లో నాలుగు స్థానాలను గెలుచుకుంటుందని భావిస్తున్నారు. ఐదవ స్థానానికి, ఎన్డీయేకి అదనంగా ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం, బీజేపీ ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టింది. ఇప్పుడు, ఐదవ స్థానం మిగిలి ఉంది. ఇది రాజకీయంగా తీవ్రమైన చర్చకు దారితీసింది.

More Stories
దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు లేవు
నియోజకవర్గాల పునర్విభజనకు ఇండియా కూటమి వ్యతిరేకం
భారత్‌లో చొరబాటుకు సిద్ధంగా 800 మంది ఉగ్రవాదులు