బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దీన్, ప్రధానమంత్రి షేక్ హసీనాను పదవీచ్యుతుడిని చేసిన తర్వాత ముహమ్మద్ యూనస్ తాత్కాలిక పాలన తనతో ఎలా వ్యవహరించిందో వెల్లడించిన కొన్ని రోజుల తర్వాత, ఇస్లామిక్ పార్టీ, బంగ్లాదేశ్ జమాత్-ఇ-ఇస్లామి అమీర్, షఫీకర్ రెహమాన్, యూనస్ పై భారీ దాడిని ప్రారంభించారు. షాబుద్దీన్ చేసిన ఆరోపణలపై యూనస్ లేదా ఆయన సహాయకులు స్పందించకుండా జమాత్‌కు చెందిన షఫికర్ రెహమాన్ అధ్యక్షుడిపై దాడికి దిగడం గమనార్హం.
వాస్తవానికి, ముహమ్మద్ యూనస్, అతని తాత్కాలిక పాలనపై నిప్పులు చెరిపిన షాబుద్దీన్, ఇస్లామిక్ పార్టీ గురించి ప్రస్తావించని లేదు. అయినా జమాత్ అమీర్ అధ్యక్షుడిపై దాడి చేయడం గమనిస్తే బంగ్లాదేశ్‌లోని ఇస్లామిస్ట్ గ్రూపులకు, యూనస్ తాత్కాలిక పాలనకు మధ్య ఉన్న సంబంధాన్ని అనుకోకుండా బహిర్గతం చేసినట్లయింది.
ఫేస్‌బుక్‌లో రాస్తూ, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న షఫీకర్ రెహమాన్, ఆగస్టు 5, 2024న హసీనా దేశం విడిచి వెళ్ళిన రోజు జరిగిన సంఘటనలకు సంబంధించి అనేక వాస్తవాలను షాహబుద్దీన్ ఎలా అణిచివేశారని ప్రశ్నించారు. ఆ రోజున, ఇస్లామిస్టులు హైజాక్ చేసిన ఘోరమైన నిరసనలను ఎదుర్కొన్న హసీనాను అవామీ లీగ్ ప్రభుత్వం అధికారం నుండి బలవంతంగా తొలగించారు.
గతవారం బంగ్లా వార్తాపత్రిక కలేర్ కొంథోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, షాహబుద్దీన్ యూనస్ పాలనను దుమ్మెత్తిపోశారు. దాని పాలనలోని అనేక చర్యలు రాజ్యాంగ విరుద్ధమని ధ్వజమెత్తారు. యూనస్ పరిపాలన తనను వర్చువల్ గృహ నిర్బంధంలో ఉంచిందని, అధ్యక్ష పదవి నుండి తనను తొలగించేందుకు అనేకసార్లు ప్రయత్నించిందని, వైద్య చికిత్స కోసం బంగ్లాదేశ్ నుండి వెళ్లకుండా నిరోధించిందని ఆరోపించారు.
“ఆగస్టు 5, 2024 గురించి అధ్యక్షుడు చాలా విషయాలను అణిచివేశారు. పడిపోయిన, పారిపోయిన ప్రధానమంత్రి రాజీనామా గురించి అక్కడ ఉన్న నాయకులకు తాను చెప్పిన దాని గురించి, తర్వాత దేశానికి ఆయన చెప్పిన దాని గురించి ఆయన తన ప్రస్తుత ప్రకటనలో అంగీకరించలేదు. ఆ రోజు తాను ఇప్పుడు చెబుతున్న దాని గురించి ఆయన ఏమీ చెప్పలేదు” అని రెహమాన్ మంగళవారం ఫేస్‌బుక్‌లో రాశారు.
షేక్ హసీనా రాజీనామా లేఖ కనిపించకపోవడంపై వివాదం గురించి ప్రస్తావించారు. హసీనా భారతదేశానికి వెళ్లిన తర్వాత యూనస్ తాత్కాలిక పాలన రావడాన్ని చట్టబద్ధం చేయడానికి రాజ్యాంగబద్ధంగా అవసరమైన పత్రం ఇది. “ప్రధానమంత్రి షేక్ హసీనా తన రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందజేసారని మీకు తెలుసు, నాకు అది అందింది” అని హసీనా వెళ్లిన కొన్ని గంటల తర్వాత ఆగస్టు 5న జాతినుద్దేశించి చేసిన టెలివిజన్ ప్రసంగంలో షహాబుద్దీన్ ప్రకటించారు.
అయితే, రెండు నెలల తర్వాత, హసీనా రాజీనామా చేసినట్లు మాత్రమే తాను విన్నానని, కానీ ఆమె రాజీనామాకు సంబంధించిన ఆధారాలు తన వద్ద లేవని ఆయన పేర్కొన్నారు. “నేను [రాజీనానా లేఖను సేకరించడానికి] చాలాసార్లు ప్రయత్నించాను కానీ విఫలమయ్యాను. బహుశా ఆమెకు సమయం లేకపోవచ్చు” అని షహాబుద్దీన్ 2024 అక్టోబర్‌లో ఢాకాకు చెందిన వార్తాపత్రిక జనతార్ చోఖ్‌తో పేర్కొన్నారు.
షాహబుద్దీన్ తొలగింపును డిమాండ్ చేస్తూ నిరసనలకు దారితీసింది. చివరికి అధ్యక్షుడు ఆ తుఫాను నుండి బయటపడగలిగారు. షాహబుద్దీన్ యూనస్ పాలనలో 18 నెలలు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా కొనసాగారు. తాత్కాలిక పాలన తనను అత్యున్నత పదవి నుండి తొలగించడానికి పదేపదే ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.
అయితే, ఫిబ్రవరి 12 నాటి ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బిఎన్‌పి ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత, అధ్యక్షుడు ఆ కాలంలో తాను ఎదుర్కొన్న దాని గురించి చాలా వెల్లడించారు. బంగ్లాదేశ్, అమెరికా మధ్య “రహస్య” వాణిజ్య ఒప్పందం ఉదాహరణను ఇస్తూ, యూనుస్ పాలన తన చివరి రోజుల్లో సంతకం చేయడానికి తొందరపడ్డారు.
“అటువంటి ప్రభుత్వ ఒప్పందాన్ని నాకు తెలియజేయాలి. చిన్నదైనా లేదా పెద్దదైనా, మునుపటి ప్రభుత్వ పెద్దలు అధ్యక్షుడికి తెలియజేశారు. ఇది రాజ్యాంగ బాధ్యత. కానీ అతను [యూనస్] దానిని చేయలేదు,” అని తెలిపారు.
ఆయన ప్రకారం, బిఎన్‌పి ఉన్నత స్థాయిల నుండి, అలాగే సాయుధ దళాల నుండి తనకు లభించిన మద్దతు కారణంగా మాత్రమే అధ్యక్షుడు తట్టుకొని అధికారంలో కొనసాగగలిగారు. “రాజ్యాంగ విరుద్ధమైన మార్గాల ద్వారా అధ్యక్షుడిని తొలగించడాన్ని మేము సమర్థించడం లేదు” అని హామీ ఇచ్చారని షహబుద్దీన్ వెల్లడించారు.
“నాకు సింగపూర్‌లోని నేషనల్ యూనివర్శిటీ హాస్పిటల్‌లో బైపాస్ సర్జరీ జరిగింది. సర్జరీ తర్వాత ఒక సంవత్సరం తర్వాత, అక్కడి ఆసుపత్రిలో ఫాలో-అప్ అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. చికిత్స కోసం సింగపూర్ వెళ్లాలని నేను విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాశాను. ప్రతిస్పందనగా, నన్ను నేరుగా నిషేధించారు,” అని షాబుద్దీన్ ఆరోపించారు. రెండు సందర్భాలలో ఈద్ ప్రార్థనలలో పాల్గొనడానికి నేషనల్ ఈద్గా మైదాన్‌కు వెళ్లడానికి కూడా తనకు అనుమతి లేదని ఆయన వాపోయారు.
జమాత్, దాని పురుష విద్యార్థి విభాగం, ఇస్లామీ ఛత్ర శిబిర్ వంటి ఇస్లామిస్ట్ గ్రూపులు అవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి కుట్ర పన్నాయని అప్పట్లోనే ఆరోపణలు రావడంతో, అధ్యక్షుడి వాదనలకు అమీర్ స్పందన ప్రాముఖ్యతను సంతరించుకుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇస్లామిస్టులు, తాత్కాలిక పాలన ప్రారంభం నుండే పరస్పరం ప్రయోజనకరమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి.
బంగ్లాదేశ్‌లో కోటా వ్యతిరేక ఉద్యమం ఇస్లామిస్ట్ గ్రూపులచే హైజాక్ కావించిన తర్వాత శాంతియుత ఉద్యమం నుండి హింసాత్మకమైనదిగా ఎలా మారిందో ఇదివరకే పలు కధనాలు వెలువడ్డాయి. ఇంకా, హసీనా వ్యతిరేక ఉద్యమంలో ముందంజలో ఉన్న అనేక మంది విద్యార్థి నాయకులు, నేషనల్ సిటిజన్స్ పార్టీని ఏర్పాటు చేసే నహిద్ ఇస్లాం వంటి వారు 2026 ఎన్నికలకు జమాత్‌తో పొత్తు పెట్టుకున్నారు.
ఈ విద్యార్థి నాయకులలో చాలామంది యూనస్ క్యాబినెట్‌లో మంత్రి పదవులను కూడా పొందారు. ఆగస్టు 2024లో పదవీ బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల తర్వాత, యూనస్ ఇస్లామిస్ట్ గ్రూప్ హెఫాజత్-ఎ-ఇస్లాం నాయకుడు మామునుల్ హక్‌ను కలిశారు.
ప్రతిగా, యూనస్ “1971లో పాకిస్తాన్ నుండి హింసాత్మకంగా విడిపోవడానికి దారితీసిన సింక్రెటిక్ బెంగాలీ సంస్కృతిని, లౌకిక భాషా జాతీయవాదాన్ని అణచివేయగల మౌలికవాద అంశాలను ప్రోత్సహించడం ద్వారా” బంగ్లాదేశ్ ఇస్లామిక్ రిపబ్లిక్ వైపు మారేందుకు దోహదపడ్డాడు అని జర్నలిస్ట్-రచయిత సుబీర్ భౌమిక్ ఇండియా టుడే డిజిటల్‌లో ఒక వ్యాసంలో రాశారు.
యూనస్ పాలన తీసుకున్న అనేక చర్యలు బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ శక్తుల పునరుజ్జీవనానికి దోహదపడ్డాయి. హసీనా నిష్క్రమణ తర్వాత కొన్ని రోజులకు, పరిపాలన జమాత్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది. దీనిని అవామీ లీగ్ ప్రభుత్వం నిషేధించింది. అదే సమయంలో, బంగ్లాదేశ్ సైనికపరంగా, దౌత్యపరంగా పాకిస్తాన్ వైపు ఆకర్షితుడైంది. అంతేకాకుండా, యూనస్ పరిపాలన జైలులో ఉన్న అనేక మంది ఇస్లామిస్ట్ నాయకులను విడుదల చేసింది.
వీరిలో అన్సరుల్లా బంగ్లా బృందం అధిపతి, దోషిగా తేలిన ఉగ్రవాద సూత్రధారి జషీముద్దీన్ రెహమానీ కూడా ఉన్నారు. పాలన 1971 యుద్ధ నేరస్థుడు ఎటిఎం అజరుల్ ఇస్లాంను కూడా విడుదల చేసింది. ఎన్నికలలో, మరణశిక్షకు గురైన ఎటిఎం, రంగ్‌పూర్-2 స్థానాన్ని గెలుచుకుంది. జమాత్‌తో పొత్తు ఎన్నికల ముందు చాలా మంది నిజమైన విద్యార్థి నాయకులు రాజీనామా చేయడానికి దారితీసింది.
ఎన్సీపీకి చెందిన అనేక మంది మహిళా నాయకులు పార్టీని వీడారు. కొందరు ఫిబ్రవరి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. యూనస్ లేదా బంగ్లాదేశ్‌లో పనిచేస్తున్న ఇస్లామిస్ట్ గ్రూపులు తమ మధ్య సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించనప్పటికీ, ఇద్దరూ ఒకరి చర్యల నుండి ఒకరు స్పష్టంగా ప్రయోజనం పొందారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అందువల్ల, షహబుద్దీన్‌పై రెహమాన్ విమర్శ రాజ్యాంగపరమైన ఔచిత్యాన్ని కాపాడుకోవడం గురించి కాకుండా, రెండు వైపులా పనిచేసిన రాజకీయ ఏర్పాటును కాపాడుకోవడం గురించి అని స్పష్టం అవుతుంది.

More Stories
పాక్ ఎఫ్-16 కూల్చివేత, ఆఫ్ఘన్ తో ‘బహిరంగ యుద్ధం’
ఇజ్రాయెల్‌తో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం
వరుసగా రెండో రోజు అనిల్ అంబానీని ప్రశ్నిస్తున్న ఈడీ