చిన్నపాటి కార్యాచరణలతో కూడిన దాడికి ట్రంప్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఆ తర్వాత అది పూర్తి స్థాయి సైనిక చర్యగా మారుతుందని యోక్సియోస్ తెలిపింది. ఇజ్రాయెల్‌తో కలసి అమెరికా సైనిక చర్యకు దిగవచ్చని, ఇది ప్రాంతీయ సైనిక ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని వార్తాసంస్థ పేర్కొన్నది. జెనీవాలో జరిగిన తాజా అణు చర్చలుసహా దౌత్య స్థాయి చర్చలు కొనసాగుతున్నప్పటికీ అవి ఫలప్రదమయ్యే అవకాశాలు కనపడడం లేదని అధికారులను ఉటంకిస్తూ వార్తాసంస్థ పేర్కొన్నది.
మరోవంక, ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ అమెరికాకు ప్రత్యక్ష హెచ్చరికలు జారీచేశారు. అమెరికన్ యుద్ధ నౌకలను సముద్రం అడుగుభాగానికి పంపగల ఆయుధాలు ఇరాన్ వద్ద ఉన్నాయని ఖమేనీ తెలిపారు. అమెరికా విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు, సముద్రంలో మునిగిపోతున్నట్లు చూపించే ఏఐ ఫొటోను ఖమేనీ షేర్ చేశారు.
ఇరాన్ వైపు ఓ యుద్ధ నౌకను పంపినట్లు అమెరికన్లు నిరంతరం చెబుతుంటారని ఎక్స్‌లో ఖమేనీ పేర్కొన్నారు. నిజానికి సైనిక పరికరాల్లో యుద్ధనౌక ఓ ప్రమాదకర భాగమే. అయితే ఆ నౌకను సముద్రం అడుగుకు పంపగల ఆయుధం మరింత ప్రమాదకరం అని ఆయన హెచ్చరించారు. ఆయుధ సంపత్తిలో తమకు ఎవరూ సాటిలేరంటూ అమెరికా చెబుతున్న మాటలను ఆయన కొట్టివేశారు.తన దేశానికి ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యం ఉందని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నారు. అయినా అత్యంత బలమైన సైన్యం కూడా కొన్నిసార్లు తన కాళ్లపై నిలబడలేనంతగా దెబ్బలు తింటుంది అని ఖమేనీ ఎద్దేవా చేశారు.
ఇలా ఉండగా, గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన సైనిక బలగాలను మోహరిస్తున్న నేపథ్యంలో రష్యా, చైనా, ఇరాన్ దేశాలకు చెందిన నౌకా దళాలు హర్ముజ్ జలసంధి చుట్టూ ఉన్న జలాలలో యుద్ధ నౌకలను మోహరించి సైనిక విన్యాసాలకు సిద్ధమయ్యాయి. ఈ జలసంధి పర్షియన్ సింధుశాఖ నుంచి మహా సముద్రాలలోకి దారితీసే ఏకైక సముద్ర మార్గం. ఇది ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మక ప్రాంతాలలో ఒకటి. దీనికి ఉత్తర తీరంలో ఇరాన్, దక్షిణ తీరంలో యూఏఈ, ముసందమ్, ఒమన్ ఉన్నాయి.

More Stories
కుత్రిమ మేధలో దేశ భవిష్యత్ చూస్తున్నాం
ఏఐ సదస్సులో చైనా రోబో డాగ్‌పై వివాదం
చంచల్‌గూడ జైలు నుంచి పాకిస్థాన్‌కు ఫోన్ కాల్స్!