పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్-2026 రాష్ట్ర స్థాయి కార్యశాలను బిజెపి రాష్ట్ర కార్యాలయంలో, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి కార్యకర్తకు శిక్షణ అందించే అతి పెద్ద రాజకీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యశాల జరిగింది.
ఈ శిక్షణ శిబిరంలో పార్టీ సిద్ధాంతాలపై నాయకులు, కార్యకర్తలకు లోతైన అవగాహన కల్పించడంతో పాటు, దేశంలోని తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అలాగే, సైద్ధాంతిక సాధికారతను పెంపొందిస్తూ, సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికలను సవివరంగా వివరించారు.
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర పదాధికారులు, బిజెపి జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రభారీలు, తదితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు ప్రసంగిస్తూ
తెలంగాణలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు పార్టీ ఎదుగుదలకు స్పష్టమైన నిదర్శనం అని తెలిపారు.ఈ విజయాలు కేవలం ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదని, రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి అనుకూలమైన రాజకీయ వాతావరణాన్ని నిర్మించడంలో మన కార్యకర్తలు సాధించిన విజయం అని చెప్పారు.
ప్రజల్లోనే కాదు, కార్యకర్తల్లో కూడా “తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం” అనే విశ్వాసం బలపడిందని తెలిపారు. ఈ శిక్షణ మహాభియాన్ ఉద్దేశం ప్రతి కార్యకర్తను సిద్ధాంతపరంగా దృఢంగా తయారు చేయడం, రాబోయే ఎన్నికలకు సంస్థాగతంగా సిద్ధం కావడం, అలాగే తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువెళ్లడం అని చెప్పారు.

More Stories
నటి ప్రత్యూష కేసులో నిందితుడు లొంగిపోవాలని సుప్రీం ఆదేశం
తెలంగాణాలో 15 మునిసిపాలిటీల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ
విద్యుత్ బకాయిలు రూ 15 కోట్లు చెల్లించాలి.. ‘గీతం’ కు సుప్రీం ఆదేశం