జె ఎన్ యు విద్యార్థి సంఘం నేతల బహిష్కరణ

జె ఎన్ యు విద్యార్థి సంఘం నేతల బహిష్కరణ
 
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (జెఎన్‌యుఎస్‌యు) ఎన్నికైన నలుగురు ఆఫీస్ బేరర్లను – అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి,  సంయుక్త కార్యదర్శి లను యూనివర్సిటీ పాలకవర్గం సస్పెండ్ చేసింది. వారికి క్యాంపస్‌ నుండి బహిష్కరించింది. విద్యార్థి సంఘంమాజీ అధ్యక్షుడు నితీష్ కుమార్‌పై కూడా అదే చర్య తీసుకున్నారు. 
 
ప్రస్తుత విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అదితి మిశ్రా, ఉపాధ్యక్షురాలు గోపికా బాబు, ప్రధాన కార్యదర్శి సునీల్ యాదవ్, సంయుక్త కార్యదర్శి డానిష్ అలీ, మాజీ అధ్యక్షుడు నితీష్ కుమార్‌లకు ఒక్కొక్కరికి రూ. 20,000 జరిమానా విధించారు. 2026 శీతాకాలం, వర్షాకాల సెమిస్టర్‌లకు క్యాంపస్ నుండి బహిష్కరించారు.  2025 నవంబర్ 21న జరిగిన ఒక సంఘటనపై ప్రొక్టోరియల్ విచారణ తర్వాత ఈ చర్య తీసుకున్నారు.
ఈ సమయంలో విద్యార్థులు బి ఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో ముఖ గుర్తింపు గేట్లు, సిసిటివి కెమెరాలను దెబ్బతీశారని, దీని వలన రూ. 20 లక్షల నష్టం వాటిల్లిందని అంచనా.  ఈ వ్యవస్థను “నిఘా యంత్రాంగం”, “గోప్యతా ఉల్లంఘన”గా విద్యార్థులు ఈ చర్యలను వ్యతిరేకించడంతో 2025 ఆగస్టులో నిరసనలు ప్రారంభమయ్యాయి.
జెఎన్‌యుఎస్‌యు ప్రకారం, విద్యార్థి సంఘ ఎన్నికల సమయంలో నవంబర్‌లో బయోమెట్రిక్ గేట్లను ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన సంఘం తమ నిరసనలను తీవ్రతరం చేసింది. అనంతరం విశ్వవిద్యాలయం విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టి, పోలీసులకు ఫిర్యాదులు చేసింది. సామూహిక ప్రతిఘటనను బలహీనపరచడమే లక్ష్యంగా ఈ బహిష్కరణలు జరిగాయని అధ్యక్షురాలు అదితి మిశ్రా విమర్శించారు. “బహిష్కరణ మమ్మల్ని విచ్ఛిన్నం చేస్తుందని పరిపాలన భావిస్తోంది” అని ఆమె పేర్కొన్నారు. “బదులుగా, ఇది మా సంకల్పాన్నిబలోపేతం చేసింది” అని చెప్పారు.
ఉన్నత విద్యలో సమానత్వ ఆధారిత నిబంధనల పునరుద్ధరణ, కుల ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా చట్టపరమైన రక్షణల కోసం విద్యార్థులు చేస్తున్న డిమాండ్లతో ఆమె ఈ చర్యను అనుసంధానించారు. ఎఐఎస్ఏ, ఎస్ఎఫ్ఐ వంటి వామపక్ష మద్దతుగల విద్యార్థి సంఘాలు ఈ క్రమశిక్షణా చర్యలను ముఖ్యంగా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో నిఘా కోసం చేస్తున్న ఒత్తిడికి వ్యతిరేకంగా. అసమ్మతిపై రాజకీయంగా ప్రేరేపించిన అణిచివేతగా అభివర్ణించాయి. ఈ చర్య కారణంగా తిరిగి ఎన్నికలు జరిపేవరకు విద్యార్థిసంఘం లేకుండా పోతుంది.
 
ప్రధాన కార్యదర్శి సునీల్ మాట్లాడుతూ, “యుజిసి నియంత్రణకు సంబంధించి క్యాంపస్‌లో నిరసన నిర్వహించాలని మేము ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. దీనిని సుప్రీంకోర్టు నిలిపివేసింది” అని చెప్పారు.  కాగా, హాస్టళ్లలో లేదా యూనివర్సిటీ క్యాంపస్‌లో మరెక్కడైనా క్రమశిక్షణాచార్యకు గురైన వారికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు గుర్తించిన ఏ విద్యార్థి అయినా క్రమశిక్షణా చర్యను ఎదుర్కోవలసి ఉంటుందని కూడా నోటీసు హెచ్చరించింది.