గతేడాది డిసెంబర్‌లో రష్యా నుండి భారత్‌కు ముడి చమురు దిగుమతుల విలువ 38 నెలల కనిష్టానికి 2.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అదే సమయంలో 2024 డిసెంబర్ కంటే అమెరికా నుండి దిగుమతులు సుమారు 13 శాతం పెరిగాయని తాజా నివేదిక తెలిపింది. భారతదేశ దిగుమతుల్లో రష్యన్ చమురు నాలుగో వంతు కంటే తక్కువగా ఉందని, ఇది గత నెల 34శాతం నుండి తగ్గిందని పేర్కొంది.
భారత్ రష్యా నుండి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందని, బదులుగా భారత్ దిగుమతులపై టారిఫ్‌లను 50శాతం నుండి 18శాతానికి తగ్గించినట్లు గతవారం రోజుల నుండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే ప్రకటిస్తున్న సమయంలో తాజా డేటా వెలువడింది. అయితే ఈ ప్రకటనను భారత ప్రభుత్వం ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు.
నిష్పాక్షిక మార్కెట్ పరిస్థితులకు, అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా తన ఇంధనవనరులను మారుస్తున్నట్లు విదేశాంగ శాఖ వాదిస్తోంది. డిసెంబర్ 2025లో 2.7బిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశ రష్యన్ చమురు దిగుమతులు, డిసెంబర్ 2024లో దిగుమతి చేసుకున్న మొత్తం కంటే 15 శాతం తక్కువగా ఉన్నాయి.
నవంబర్ 2025లో 3.7బిలియన్ డాలర్ల విలువైన దిగుమతుల కంటే 27.1శాతం తక్కువగా ఉన్నాయి. భారతదేశ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా డిసెంబర్ 2025లో 24.9శాతానికి పడిపోయింది. ఇది మూడు సంవత్సరాల్లో అత్యల్పం. పరిమాణంతో పోలిస్తే భారత్ 5.8 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకుంది. ఇది 2025 ఫిబ్రవరి తర్వాత అత్యల్పం.
భారతదేశం డిసెంబర్ 2025లో అమెరికా నుండి 569.3 మిలియన్ల విలువైన చమురు దిగుమతి చేసుకుంది. ఇది నవంబర్ 2025లో దిగుమతి చేసుకున్న మొత్తం కంటే 60.5శాతం తక్కువగా ఉన్నప్పటికీ, నవంబర్‌లో అమెరికా నుండి చమురు దిగుమతులు ఏడు నెలల గరిష్టస్థాయికి పెరగడం కారణం. అమెరికా నుండి చమురు దిగుమతులు డిసెంబర్ 2024 కంటే సుమారు 31శాతం అధికం.
అమెరికా చెబుతున్నట్టుగానే రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు భారీగా తగ్గిపోతున్నాయి. 2024 డిసెంబరుతో పోలిస్తే గత ఏడాది డిసెంబరులో దిగుమతులు 27.5శాతం తగ్గిపోయాయి. దీనితో రష్యా చమురు అమ్ముకోవడానికి చైనాపై దృష్టి సారిస్తున్నది. ఏకంగా బ్యారెల్‌కు 12 డాలర్ల డిస్కౌంట్ ఆఫర్ చేసింది. మొత్తానికి భారత్-అమెరికా ఒప్పందం షరతుల నుంచి లాభం చైనా ప్రయోజనం పొందుతోంది.

More Stories
భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం ముసాయిదా విడుదల
అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏఐ పెను ముప్పు.. భారత్‌పైనా ప్రభావం!
కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఆర్బీఐ నిర్ణయం