కాంగ్రెస్‌ లేకుంటే ముస్లింలకు దిక్కులేదా రేవంత్ రెడ్డి!

కాంగ్రెస్‌ లేకుంటే ముస్లింలకు దిక్కులేదా రేవంత్ రెడ్డి!
కాంగ్రెస్‌ లేకుంటే ముస్లింలకు దిక్కులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల ప్రచార సభలో పేర్కొనడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి  వ్యాఖ్యలు సంతుష్టీకరణ రాజకీయాలకు పరాకాష్ట అంటూ ధ్వజమెత్తారు.  నిండైన ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ విభజనాత్మక, తుష్టీకరణ రాజకీయాల అసలు ముఖాన్ని బట్టబయలు చేస్తున్నాయని విమర్శించాహరు.
ఇవాళ ముస్లింలు ఉన్నారా అంటే అది కాంగ్రెస్ వల్లే, ముస్లింలకు గౌరవం ఉందా అంటే అది కాంగ్రెస్ వల్లే అనడం కాంగ్రెస్ పార్టీ మతాధారిత ఓటు బ్యాంక్ రాజకీయాలు మాత్రమే నమ్ముతుందని మరోసారి స్పష్టమైందని ఆయన తెలిపారు. అభివృద్ధి, పాలన, ప్రజాసేవపై చర్చ చేయడానికి బదులుగా, సమాజాన్ని మతం పేరుతో విభజించి రాజకీయ లాభం పొందే ప్రయత్నం ఇదని చెప్పారు.
సామాజిక విభేదాలను రాజకీయ లాభం కోసం రెచ్చగొట్టే ప్రమాదకర ప్రయత్నం అని ఆయన హెచహరించారు.  కేవలం 20% ముస్లింల ఓట్ల కోసం, 80% హిందువుల భావాలను నిర్లక్ష్యం చేయడం, దీనిని సెక్యులరిజం అని చెప్పడం — ఇది ప్రజలను మోసం చేయడమే అని స్పష్టం చేశారు.  పాలనతో, పనితీరుతో కాదు — సమాజాన్ని మతం ఆధారంగా విభజించి అధికారాన్ని కాపాడుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం అని స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు.

మంత్రి పదవులు సైతం ఎన్నికల లాభం కోసం మత ప్రాతిపదికన పంచడం సిగ్గుచేటని విమర్శించారు. కాగా, కాళేశ్వరం కుంభకోణం సీబీఐకి అప్పగించి మూడునెలలైనా అరెస్టులు చేయలేదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. కాళేశ్వరం కేసును ఏడాదిన్నర పాటు సాగదీసి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా వ్యవహరించిన రేవంత్ సర్కారు అసలు ఉద్దేశ్యం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.

అధికారంలోకి రాకముందు“అన్ని అవినీతి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, కేసీఆర్ జైలుకెళ్తాడు” అని పెద్ద గోల చేసిన రేవంత్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం చేతులు దులుపుకుని, కేవలం రెండు బ్యారేజీలపైనే సీబీఐ విచారణ జరపాలనడం వెనుక ఉన్న రహస్యం బీఆర్ఎస్ అవినీతి నాయకులను కాపాడే ప్రయత్నమే అని రామచందర్ రావు ఆరోపించారు.

 
ముఖ్యమంత్రి చేసిన బాధ్యతారహిత వ్యాఖ్యలతో పాటు, జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే రేషన్‌కార్డులు, సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయోజనాలు రద్దు చేస్తామన్న బెదిరింపులు ప్రజాస్వామ్యానికి అవమానం, ప్రజల స్వేచ్ఛను దెబ్బతీసే ప్రయత్నమే అని స్పష్టం చేశారు.  తెలంగాణ ప్రజలు ఈ మోసపూరిత ఆటను గుర్తించారని చెబుతూ  జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్-బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు, కుమ్మక్కు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల తీర్పు ఉండనుందని భరోసా వ్యక్తం చేశారు.