కోర్టు వివరాల ప్రకారం, మే మూర్ అనేక సంవత్సరాల పాటు జాన్సన్ & జాన్సన్ టాల్కమ్ పౌడర్‌ను ఉపయోగించారని, అందులో అస్బెస్టాస్ అనే ప్రమాదకర రసాయన పదార్థం మిశ్రమమై ఉండటంతో ఆమె మెసోథెలియోమా అనే ఊపిరితిత్తులపై ప్రభావం చూపే క్యాన్సర్ బారినపడ్డారని నిర్ధారణకు వచ్చింది. బాధితురాలి కుటుంబం 2021లో కేసు వేసి న్యాయం కోరగా, దాదాపు మూడు సంవత్సరాల విచారణ అనంతరం ఈ తీర్పు వెలువడింది.
న్యాయస్థానం కంపెనీ సురక్షితత ప్రమాణాలు పాటించలేదని, వినియోగదారులను తప్పుదోవ పట్టించిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ తీర్పును కంపెనీ అంగీకరించలేదు. తాము నిర్దోషులమని, శాస్త్రీయంగా టాల్కమ్ పౌడర్‌లో హానికర పదార్థాలున్నాయన్న నిర్ధారణలేవని పేర్కొంటూ అప్పీల్ దాఖలు చేయనున్నట్లు జాన్సన్ & జాన్సన్ ప్రకటించింది.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కంపెనీపై ఇలాంటి 63 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ తీర్పు మిగతా కేసుల తీర్పులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయవేత్తలు భావిస్తున్నారు. వినియోగదారుల భద్రతకు సంబంధించి పెద్ద సంస్థలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ కేసు మరోసారి స్పష్టంచేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

More Stories
అమెరికా క్రైస్తవ బృందం సీబీఐ ఎఫ్సిఆర్ఎ ఉల్లంఘనలపై కేసు
యుపిఐ చార్జీలతో భారత్ తిరిగి నగదు వైపు మళ్లే ప్రమాదం!
పిఎఫ్ వేతన పరిమితి రూ.25,000లకు పెంపు