రాంచందర్ రావు కార్యవర్గంలో 8 మంది ఉపాధ్యక్షులు

రాంచందర్ రావు కార్యవర్గంలో 8 మంది ఉపాధ్యక్షులు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సోమవారం రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులతో పార్టీకి సరికొత్త నాయకత్వం సమకూర్చే ప్రయత్నం చేశారు. కొత్త కమిటీలో ఉపాధ్యక్షులుగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు యాదవ్, బండారి శాంతి కుమార్, ఎం. జయశ్రీ, కొల్లి మాధవి, డాక్టర్ జె. గోపి (కళ్యాణ్ నాయక్), రఘునాథ్ రావు, బండ కార్తిక రెడ్డిలకు చోటు ద క్కింది. 

ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ ఎన్. గౌతం రావు, టి. వీరేందర్ గౌడ్, వేముల అశోక్‌లను నియమించారు. కార్యదర్శులుగా డా. ఒ. శ్రీనివాస్ రెడ్డి, కొప్పు భాష, భరత్ పర్‌షాద్, బండారు విజయలక్ష్మి, స్రవంతిరెడ్డి, కరణం పరిణిత, బద్దం మహిపాల్ రెడ్డి, డాక్టర్ తూటుపల్లి రవి కుమార్, కోశాధికారిగా దేవికి వాసుదేవ్, సంయుక్త కోశాధికారిగా విజయ్ సురాన జైన్, ముఖ్య అధికార ప్రతినిధిగా ఎన్‌వి సుభాష్‌ను నియమించారు.

మహిళా మోర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ మేకల శిల్పారెడ్డిని నియమించారు. యువ మోర్చా అధ్యక్షునిగా గణేష్ కుండె, కిసాన్ మోర్చా అధ్యక్షునిగా బస్వాపురం లక్ష్మీనర్సయ్య, ఎస్‌సి మోర్చా అధ్యక్షునిగా క్రాంతి కిరణ్, ఎస్‌టి మోర్చా అధ్యక్షునిగా నేనావత్ రవి నాయక్, ఒబిసి మోర్చా అధ్యక్షునిగా గంధమల్ల ఆనంద్ గౌడ్, మైనారిటీ మోర్చా అధ్యక్షునిగా సర్దార్ జగ్‌మోహన్ సింగ్‌ను నియమించారు.

రాంచందర్ రావు తన కార్యవర్గంలో బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మికి కార్యదర్శిగా అవకాశం కల్పించారు. పార్టీ కమిటీలో నూతన రక్తం తీసుకుని వచ్చేందుకు రాంచందర్ రావు శ్రమించారు. అదేవిధంగా విద్యావంతులకు, వెనుకబడిన వర్గాలకు పెద్ద పీట వేశారు.