* ప్రధాని మోదీతో మంత్రి లోకేష్ మర్యాద పూర్వక భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని కోరారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు, రాష్ట్రంలో ఐటి, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు.
విద్యాప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాం, ఉన్నతవిద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రధాని సహకారం, మార్గదర్శనం కావాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15 నెలలుగా కేంద్రం సహకారంతో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు.
ప్రధాని నేతృత్వంలో వికసిత్ భారత్ – 2047లో తామూ భాగస్వాములం అవుతామని తెలిపారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని కోట్లాది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించిన ప్రధాని మోదీజీకి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, సింగపూర్లో ఏపీ బృందం పర్యటన వివరాలను ప్రధానికి వివరించారు.
ఆంధ్రప్రదేశ్లో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో గత కొంతకాలంగా నెలకొన్న వివిధ పరిణామాలను మంత్రి లోకేష్ ఈ సందర్భంగా వివరించారు. ప్రధాని మోదీ స్పందిస్తూ రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని చెప్పారు. యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను ఈ సందర్భంగా ప్రధానికి లోకేష్ బహుకరించారు.

More Stories
ఎస్ఐఆర్ లో నిజమైన ఓటరుకు అన్యాయం జరగదు
ఐదో తరం విమానాలు గగనంలో ఎగరబోతున్నాయి
ఏపీలో వారానికి ఒకరోజు నో వెహికల్ డే