జమ్ముకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు మరో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మచిల్ సెక్టార్లో సరిహద్దు రేఖ వెంబడి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ చేపడుతుండగా ఈ ఎదురుకాల్పులు జరిగాయి.
ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు కూడా మరణించారని అధికారులు తెలిపారు. నియంత్రణ రేఖను దాటి దేశంలోకి చొరబబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను..ఆర్మీ, బిఎస్ఎఫ్ బృందాలు అడ్డుకునే క్రమంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
ఈ ఘటనలో ఆర్మీ అధికారి, బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ సుదీప్ సర్కార్..మరో ఇద్దరు జవాన్లు మరణించారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

More Stories
ఇరాన్ నుండి భారత్‌కు చేరుకున్న భారతీయులు
వందేమాతరం థీమ్‌తో రిపబ్లిక్ డే పరేడ్
హెచ్ఐవీ వైరస్‌ను మూలంగా తొలగించే చైనా ప్రయత్నం