“ప్రధాని మోదీ రూపంలో మన దేశానికి సమర్థవంతమైన నాయకత్వం లభించింది. ఒకప్పుడు మనది పేద దేశం అనేవాళ్లు. 11 ఏళ్ల మోదీ పాలనలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చింది. 2028కి 3వ స్థానానికి చేరుతుంది. 2047లో వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి ప్రపంచంలోనే శక్తివంతంగా మనదేశం నిలుస్తుంది 2047 నాటికి దేశంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని ముఖ్యమంత్రి చెప్పారు.
“దేశ సమగ్రత విషయంలో భారత్ ఎవరికీ తలవంచదు. దేశ క్షేమం, భద్రత విషయంలో మనమంతా ఒకటే. కార్గిల్ యుద్ధం, పహల్గామ్ ఘటన జరిగినప్పుడు దేశ ప్రజానీకం ఒక్క తాటిపై నిలిచింది. నేడు ఉన్నది ధృఢమైన భారతదేశం. విశ్వగురువుగా అవతరిస్తున్న భారతదేశం. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదానికి గట్టిగా బదులిచ్చాం. ఉగ్రవాదుల గుండెల్లో సైనికులు రైళ్లు పరుగెత్తించారు. ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న మన సైనికులకు సెల్యూట్ చేస్తున్నా” అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను, సైనిక కుటుంబాలను, రాష్ర్టానికి చెందిన అంతర్జాతీయ క్రీడాకారులను సీఎం చంద్రబాబు సత్కరించారు. విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం తదితర కార్యక్రమాల్లో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుడు గద్దె సత్యనారాయణ భార్య సుశీలను, వీరమహిళ రాంపిళ్ల నరసాయమ్మ కుమారుడు జయప్రకాష్‌ను, యుద్ధంలో మరణించిన సైనికుడు నాగరాజు సతీమణి మంగాదేవికి జ్ఞాపికలు అందజేశారు.

More Stories
ఇంటి నుంచే ప్రారంభమయ్యే ధర్మం శాశ్వత దిక్సూచి
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై అనవసర దుష్ప్రచారం
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భైరవకోన