
తెలంగాణలోని పలు జిల్లాలో 17వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతవరణ కేంద్రం వెల్లడించింది. 13వ తేదీ వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో భారీ నుం చి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉదయం, మధ్యాహ్నం ఎండతో కూడిన వాతావరణం ఉండగా, సాయంత్రం, రాత్రి సమయాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. శనివారం రాత్రి అత్యధికంగా హైదరాబాద్‌లో అంబర్‌పేటలో 11 సెంటిమీటర్లు, హిమాయత్‌నగర్‌లో 10 సెంటిమీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీట మునిగిన అమీర్‌పేట్ ప్రాంతంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపునకు గురైన అమీర్‌పేట్, గంగూభాయి బస్తీ, మైత్రీవనం, బుద్ధ నగర్ ప్రాంతాల్లో హైడ్రా, బల్దియా అధికారులతో కలిసి సందర్శించారు. గంటపాటు జరిగిన సీఎం పర్యటనలో తమ ఇండ్లలోకి వస్తున్న వరదకు మోక్షమెప్పుడూ సీఎం ఎదుట ప్రస్తావించారు.
ఒక పక్క వర్షాలతో నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా వాహనాలను బయటకు తీసి వెళ్లాలంటే వాహనదారుడి నడ్డి విరిగిపోతుంది.. అడుగడుగున గుంతలతో నగర వాసి ప్రయాణం దిన దిన గండంగా మారుతోంది. గంటల తరబడి ప్రయాణంతో రోడ్లపైనే గడుపుతూ నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని ప్రధాన రహదారులతో పాటు శివారులలోని ప్రధాన రూట్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కడకక్కడే ఏర్పడుతుంది. ఇందుకు ప్రధాన కారణం రోడ్లపై ఎక్కడి గుంతలు అక్కడే ఉంటున్నాయి.
ఆయా గుంతలను కనీసం తాత్కాలికంగా పూడ్చీ వాహనాల వేగం పెంచాలనే ఆలోచన కూడా యంత్రాంగానికి లేకపోవడంతో వాహనదారులు ప్రతినిత్యం ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. బంజారాహిల్స్ వంటి ప్రాంతాలలోను కొన్ని చోట్ల రోడ్లు కోతంకు గురయ్యాయి, ఐటీ కారిడార్లలోను రోడ్లపై గుంతలు పడ్డాయి. హైదరాబాద్‌లోని పశ్చిమ భాగాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తొచ్చని పేర్కొంటూ కార్యాలయాలు 13, 14 తేదీల్లో పని సమయాల్లో మార్పులు చేసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సూచించారు.
ఆగస్టు 13న తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ పేర్కొంది.వాటిలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, తదితర జిల్లాలున్నాయి. అదే రోజు హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆగస్టు 14న మరింత ఎక్కువ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?