మూడు దశాబ్దాలకు పైగా కంపెనీని నడిపించిన సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణలు, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన అనుమానాలు, కార్పొరేట్ గవర్నెన్స్‌పై ప్రశ్నల నేపథ్యంలో నవంబర్ 12న సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అయితే, కేవలం 11 రోజుల వ్యవధిలోనే కంపెనీ బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకుంది.
తిరిగి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జెన్సన్ హువాంగ్ స్పందిస్తూ నూతన పారిశ్రామిక విప్లవం ఊపందుకుంటున్న ఈ తరుణంలో ఎన్విడియాకు మళ్లీ సారథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని తెలిపారు. వినమ్రతతో, రెట్టింపు అంకితభావంతో ఈ బాధ్యతను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. హువాంగ్ రాజీనామా, కంపెనీపై వచ్చిన ఆరోపణలు, అమెరికా అధికారుల దర్యాప్తు, ఏఐ రంగంలో ఇన్వెస్ట్మెంట్లపై నెలకొన్న ఆందోళనలు ఎన్విడియా షేర్లపై ప్రభావం చూపాయి.
నవంబర్ 12న ఒక్కో షేర్ 166.19 డాలర్ల వద్ద ముగియగా, నవంబర్ 20 నాటికి 125.53 డాలర్లకు పడిపోయింది. ఈ రెండు క్లోజింగ్ ప్రైస్‌లను పోలిస్తే 40.66 డాలర్లు, అంటే సుమారు 24.47 శాతం క్షీణత నమోదైంది. నవంబర్ 20 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 3.04 ట్రిలియన్ డాలర్లకు చేరింది. నవంబర్ 12 నాటి విలువతో పోలిస్తే దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల మేర తగ్గుదల కనిపించింది. అయితే, తిరిగి నియమించడంతో షేర్ల విలువ ఒకేసారి 30 శాతం మేరకు పెరిగాయి.

More Stories
950 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్..!
డార్క్ వెబ్‌లో అగ్నివీర్ డేటా 500 డాలర్లకు అమ్మేందుకు యత్నం
మహారాష్ట్రలో రూ.5,675 కోట్ల `అదానీ’ పనులు నిలిపివేత!