అమెరికా న్యాయశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ నేరస్థుల పట్ల సానుభూతి చూపుతూ బాధితులు, వారి కుటుంబాల ప్రయోజనాలను విస్మరిస్తున్నారని న్యూసమ్‌తోపాటు వామపక్ష శక్తులపై ఆరోపణలు చేశారు. క్షమాభిక్ష పొందిన మరణశిక్ష ఖైదీల్లో తన కుటుంబంలోని తొమ్మిది మందిని హత్య చేసిన వ్యక్తి, 12 ఏళ్ల పాలీ క్లాస్‌ను హత్య చేసిన నిందితుడు, ఎనిమిదేళ్ల గాబ్రియేల్ ఫెర్నాండెజ్‌ను చిత్రహింసలకు గురిచేసి చంపిన వ్యక్తి ఉన్నారని ట్రంప్ ప్రస్తావించారు.
న్యూసమ్, వామపక్ష శక్తులు చిన్నారులు, వారి తల్లిదండ్రుల పట్ల కాకుండా అమాయకుల ప్రాణాలు తీసిన నేరస్థుల పట్ల సానుభూతి చూపుతున్నారని ఆరోపించారు. అమెరికా చిన్నారుల రక్షణ, కుటుంబాల భద్రతకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. హంతకుల సౌకర్యం కోసం అమెరికా కుటుంబాలకు న్యాయం జరగకుండా చూడబోమని స్పష్టం చేశారు.
డెమోక్రాట్లతో కలిసి ఔషధాల ధరలు తగ్గించడం, వైద్య సేవలు మెరుగుపరచడం, అమెరికా కార్మికుల రక్షణ వంటి అంశాల్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ తెలిపారు. అయితే ప్రజల భద్రత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. చట్టాన్ని అమలు చేసే పోలీసులు శత్రువులు కాదని, ప్రజలను హత్యలు, అత్యాచారాలకు గురిచేసే వారే అసలైన శత్రువులని వ్యాఖ్యానించారు.
బాలలను హత్య చేసిన వారితోపాటు అత్యాచారాలు, మానవ అక్రమ రవాణాకు పాల్పడి బాధితులను హత్య చేసిన వారికి మరణశిక్ష విధించాలని న్యాయశాఖను ఆదేశిస్తూ ఆదేశం జారీ చేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే కోర్టులు మరణశిక్ష విధించిన ఫెడరల్ ఖైదీలకు శిక్ష అమలును వేగవంతం చేయాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించనున్నట్లు చెప్పారు.
“బాలలను హత్య చేసినవారు, అత్యాచారాలకు పాల్పడి బాధితులను చంపినవారు, మానవ అక్రమ రవాణా చేస్తూ ప్రాణాలు తీసినవారికి మరణశిక్ష విధించాలని న్యాయశాఖను ఆదేశిస్తూ అధ్యక్ష ఆదేశంపై సంతకం చేస్తాను. ఫెడరల్ మరణశిక్షల అమలును వేగవంతం చేయాలని కూడా అటార్నీ జనరల్‌ను ఆదేశిస్తాను. జ్యూరీలు తీర్పు ఇచ్చిన తర్వాత మరణశిక్ష అమలు వేగంగా, కచ్చితంగా జరగాలి” అని ట్రంప్ పేర్కొన్నారు.

More Stories
కాప్ 31లో ప్రపంచానికి విచ్ఛిన్నమైన ఫలితం.. సిఎస్ఈ
దలైలామా వారసుడి ఎంపికలో చైనా జోక్యంపై అమెరికా ఆందోళన
అమెరికాలో 20 నెలల్లో 6 వేల మందికిపైగా భారతీయుల అరెస్ట్