రబీ సీజన్లో ఎరువుల కోసం రూ.62,370 కోట్ల సబ్సిడీకి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. అలాగే నార్త్, సౌత్ బ్లాక్‌లను మ్యూజియంగా మార్చేందుకు అనుగుణంగా యుగే యుగీన్ మ్యూజియం అభివృద్ధికి రూ.3,230 కోట్లు కేటాయించేందుకు నిర్ణయించింది. నోయిడా సెక్టార్ 51 నుంచి గ్రేటర్ నోటియా సెక్టార్ 4 వరకు రూ.2,390 కోట్లతో మెట్రో రైలు మార్గం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
బ్యాంకులు లేదా రుణ సంస్థలు ఇచ్చే ఈ రుణాలకు డిఫాల్ట్ (రుణాలు తిరిగి చెల్లించలేకపోవడం) రిస్క్ లేకుండా సీజీఎఫ్ఎంయూ పథకం రక్షణ లభిస్తుంది. దీని ద్వారా రూ.12.6 లక్షల కోట్ల విలువైన ముద్రాయోజన రుణాలకు ఊతం లభిస్తుంది. కేంద్ర కేబినెట్ స్టాండప్ ఇండియా పథకం గడువును 2031 మార్చి 31 వరకు అంచే ఐదేళ్లపాటు పొడిగించింది.
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ)ల్లోని వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి, అలాగే వారిలో పారిశ్రామిక నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రానున్న 5 ఏళ్లలో అదనంగా మరో 2.5 లక్షల మంది వ్యాపారవేత్తలకు ఆర్థిక సాయం అందిస్తారు. 2016 ఏప్రిల్‌లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2.75 లక్షల మందికి పైగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలకు ఈ రుణాలు అందించారు.

More Stories
జీడీపీ వృద్ధి అంచనాను 7 శాతానికి పెంచిన మూడీస్
ఢిల్లీ కాలుష్యంకు టపాసులు మాత్రమే కాదు, పంట వ్యర్థాలు కూడా
డాలర్‌తో 23 పైసలు పెరిగిన రూపాయి