భారత ప్రభుత్వం యుద్ధం చేసి నాటి హైదరాబాద్ సంస్థానాన్ని 17 సెప్టెంబర్ 1948 రోజు నిరంకుశ మతోన్మాది నిజాం నుండి విమోచనం చేస్తే నేడు ప్రత్యేక తెలంగాణా సాధించి కూడా ప్రభుత్వం విమోచన దినంగా నిర్వహించకపోవడం చూస్తే పైకి సెక్క్యులర్ పార్టీల చేతుల్లో అధికారం ఉన్నా నేడు కూడా తెలంగాణాలో రజాకార్ల చేతుల్లోనే అధికారం నడుస్తుందనేది స్పష్టం అవుతుందని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆలంపూర్, వేములవాడ, ధర్మపురి లతో పాటు గ్రామ గ్రామాన దేవాలయాలపై దాడులు చేసిన రజాకార్ భావజాలం నేటికి ప్రతిరోజూ ఎక్కడో ఒక దగ్గర దేవాలయాలపై దాడులకు పాల్పడుతుందని విహెచ్పి జాతీయ అధికార ప్రతినిది డా. రావినూతల శశిధర్, మఠ్ మందిర్ అఖిలభారత సంయోజక్ ఎం. రామరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సునితా రాంమోహన్ రెడ్డి విమర్శించారు. దాడి జరిగిన ప్రతిసారి పిచ్చోళ్ళు అని చిత్రీకరిస్తున్న ప్రభుత్వం ఆ పిచ్చోళ్ళు ఎక్కడ తయారై వస్తున్నారో చెప్పలేక పోతుందని విస్మయం వ్యక్తం చేశారు.
భాగ్యనగరంతో పాటు రాష్ట్రంలో అనేక చోట్ల దేవాలయాల భూములను రజాకార్లు నేటికి ఆక్రమిస్తున్నారని, నిజాం వారసుల పేరిట ఇప్పటికి తప్పుడు పత్రాలతో రాష్ట్రంలో విలువైన భూములు కబ్జాలు చేస్తున్నారని పేర్కొంటూ వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొన్న రాముడి విగ్రహం తొలగించిన శ్రీరామ్ చౌక్ చుట్టుప్రక్కల ప్రాంతం అమ్మవారి దేవాలయానిదే, చట్టం పేరు చెప్పి శ్రీరాముని విగ్రహాన్ని తొలగించిన ఆబిడ్స్ పోలీస్టేషన్ శ్రీ లక్ష్మీనర్సింహ్మ స్వామి ఆలయ భూమి ఆక్రమణలో నిర్మించిందే అని గుర్తు చేశారు.

నగరం నడిబొడ్డున నిర్మించిన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ దేవాలయ భూమిలో నిర్మించారని పేర్కొంటూ బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో శ్రీ నరసింహ స్వామి ఆలయానికి చెందిన 47 ఎకరాల 19 సెంట్ల భూమి ఎమైంది? ఐసిసిసి భవనం దేవాలయ భూమిలో కట్టిందేనా ? ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. ఒక్క భాగ్యనగరంలోనే 3000 ఎకరాల 19 గుంటలు (రికార్డుల ప్రకారం) ఎమైనాయో ప్రభుత్వం హిందూ సమాజానికి లెక్కలు చెప్పాలని స్పష్టం చేశారు.
తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఇక్కడి సాంస్కృతి పరిరక్షించాలని బోనం ఎత్తి బతుకమ్మ ఆడి ఉద్యమాన్ని నడిపింది హిందూ సమాజం, కానీ తెలంగాణా వచ్చాక వచ్చిన నూతన కట్టడాలకు కాకతీయ సాంస్కృతి మాత్రం గుర్తురాలేదని విహెచ్పి నేతలు మండిపడ్డారు. మన ప్రాంతంలో ఇస్లామిక్ మతోన్మాద పాలనపై పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, దాశరథి, కాళోజీ , స్వామి రామానంద్ తీర్ధలాంటి మహనీయులకు నివాళులు అర్పించే నాయకులు నిజాం అకృత్యాలపై మాట్లాడకపోవడం వారి కుహనా సెక్యులరిజానికి నిదర్శనం అంటూ ధ్వజమెత్తారు.
తెలంగాణాలో మనం నేటికి విదేశీ పాలకులు, మతోన్మాదుల పేర్లతోనే మన నగరాలను పిలుచుకుంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్ర రాజధాని భాగ్య లక్ష్మి అమ్మవారి పేరుతో వెలిసిన భాగ్యనగరం, నిజామాబాద్ అసలు పేరు ఇందూర్, కరీంనగర్ అసలు పేరు ఎలగందుల, మహబూబ్ నగర్ అసలు పేరు పాలమూరు, ఆదిలాబాద్ అసలు పేరు ఎదులాపురం, మహాబూబాబాద్ అసలు పేరు మానుకోట, వికారాబాద్ అసలు పేరు గంగారం అని పేర్కొంటూ ఇలా అనేక పట్టణ కేంద్రాలకు తమ ప్రాచీన పేర్లు ఉన్నాయని వారు గుర్తు చేశారు.
తెలంగాణా చరిత్రను భావితరాలకు అందించాలంటే ప్రభుత్వం మన నగరాల, పట్టణాల పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు. త్వరలో అన్ని జిల్లా మండల కేంద్రాలలో సదస్సులు నిర్వహించి జిల్లా కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇస్తామని ప్రకటించారు. ఈ ఉద్యమంలో సాహితీవేత్తలను, సామాజిక సంస్థలను, అన్ని రాజకీయ పార్టీలను భాగం చేసి తెలంగాణా సాంస్కృతిక పునఃర్వైభవ ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

More Stories
ఏపీ పై అర్నబ్ పంజా.. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు అతలాకుతలం
కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీట్లు ఎన్ని గెలిచిందో ఊహించండి?
రూ. 7,395 కోట్ల వ్యయంతో ‘పీఎం వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజన’