మూడు గేమ్‌లుగా గంటకుపైగా ఈ గేమ్ సాగింది. ఈ తుది పోరులో సింధు ఆరంభం నుంచే అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అటాకింగ్ స్మాష్‌లు, అద్భుతమైన నెట్ గేమ్‌తో వరల్డ్ నంబర్ 1ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ మొదటి గేమ్‌ను 21-16తో చేజిక్కించుకుంది. దీంతో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను ముద్దాడడమే కాకుండా అన్ సే యంగ్‌పై తొలి విజయం సాధించే అవకాశాలు కనిపించాయి.
తొలి గేమ్‌ను కోల్పోయిన తర్వాత దక్షిణ కొరియా స్టార్ అన్ సే యంగ్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. క్రాస్ కోర్ట్ షాట్లు, ర్యాలీలలో తిరుగులేని డిఫెన్స్‌తో సింధును కోర్టు నలుమూలలా పరిగెత్తించింది. పాయింట్ల వేటలో దూసుకెళ్లిన అన్ సే యంగ్, రెండో గేమ్‌ను ఏకపక్షంగా 21-11తో సొంతం చేసుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది.
విజయాన్ని నిర్ణయించే మూడో గేమ్‌లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ప్రారంభంలో 8-5తో సింధు ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఆ తర్వాత అన్ సే యంగ్ వరుసగా 9 పాయింట్లు సాధించి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఒత్తిడిలో సింధు వరుస అన్‌ఫోర్స్డ్ ఎర్రర్స్ చేయడంతో మూడో గేమ్‌ను అన్ సే యంగ్ 21-12తో సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో ఆమె వరుసగా మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఈ ఓటమితో అన్ సే యంగ్‌పై తొలి విజయం సాధించాలనే సింధు నిరీక్షణ మరింత సుదీర్ఘమైంది. అయినప్పటికీ, ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరడం సింధు కెరీర్‌లోనే ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. తన ఓటమిపై సింధు మాట్లాడుతూ తన ఆటను మెరుగుపరచుకోవడానికి ఇంకా అవకాశం ఉందని చెప్పింది.
“ఈ టోర్నీలో నా ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నాను. అయితే నేను ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. మరింత బలంగా తిరిగొచ్చేందుకు కష్టపడతాను. ఈ మ్యాచ్లో ప్రతి పాయింట్ కోసం నేను పోరాడాను. అయితే డూ ఆర్ డై మూడో సెట్లో 8-5తో ఆధిక్యంలో ఉన్నప్పుడు ఆ లీడ్ను కొనసాగించాల్సింది. కానీ దురదృష్టవశాత్తూ, ఆమె దానిని 11-9గా మార్చుకుంది” అని ఆమె తెలిపారు.

More Stories
తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ తో న్యూజిలాండ్‌పై విజయం
మక్కా, మదీనాలపై క్షిపణులను అడ్డుకున్నట్లు సౌదీ!
40,000 టన్నుల డీజిల్‌తో అమెరికాకు బయలుదేరిన మొదటి రష్యన్ ట్యాంకర్