మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హిమాన్షు భాహూ , నీరజ్ ఫర్దిపురియాలను అమెరికాలో అరెస్టు చేశారు. మర్డర్లు, వ్యవస్థీకృత నేరాల్లో ఆ ఇద్దరిపై అనేక కేసులు ఉన్నాయి. అక్టోబర్ 22వ తేదీన లాస్ వెగాస్‌లో ఇద్దర్నీ ఒకే దగ్గర అదుపులోకి తీసుకున్నారు. హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా వారిని అరెస్టు చేశారు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ సహకరించింది. ఆ ఇద్దరు నేరగాళ్లను ఇండియాకు డిపోర్ట్ చేసేందుకు అమెరికా పోలీసులతో హర్యానా ఎస్టీఎఫ్ టచ్‌లో ఉన్నది.
మరో నేరస్థుడు నీరజ్ ఫర్దిపురియా హర్యానాలోని పాల్వాల్ జిల్లా. అతనిపై మొత్తం 25 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2012లో అతన్ని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. 2015లో మర్డర్ కేసులో అతనికి జీవితకాల శిక్ష పడింది. 2019లో హర్యానా, పంజాబ్ కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రతినిధి వికాశ్ చౌదరీ హత్య కేసులో అతని పేరు ఉన్నది. కానీ దుబాయ్ మీదుగా అతను కెనడాకు పారిపోయాడు. కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్‌కు ప్రత్యర్థి గ్యాంగ్‌లీడర్‌గా చేశాడు. ఆ తర్వాత అతను అమెరికా వెళ్లాడు. హిమాన్షుతో కలిసి పనిచేశాడు. యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పుల్లో అతను ఉన్నాడు.
భారతదేశం నుండి పారిపోయిన భావు, మొదట పోర్చుగల్‌కు వెళ్లి, ఆ తర్వాత అమెరికాకు చేరుకున్నాడు. అక్కడ ఉంటూనే అతను భారతదేశంలో తన ముఠా కార్యకలాపాలను కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2023లో అతనిపై ‘లుక్ అవుట్ సర్క్యులర్’ జారీ చేశారు. అదే సంవత్సరంలో ఇంటర్‌పోల్ కూడా అతనిపై ‘రెడ్ కార్నర్ నోటీసు’ జారీ చేసింది. తనపై నమోదైన కేసులను ఎదుర్కొనేందుకు భావును తిరిగి భారతదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరిద్దరికి సంబంధించిన ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Stories
ఆసియా పారా క్రీడల్లో 114 పతకాలతో భారత్ సరికొత్త రికార్డు!
శిక్ష పూర్తయినా బంగ్లాదేశ్ జైళ్లలోనే 168 మంది భారతీయులు
మైనారిటీ హక్కులపై ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ సవాల్