ఈ అంశంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇజ్రాయెల్ స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలిపారు. తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలిపారు. ఇదే అంశంపై నెతన్యాహు కూడా “నా స్నేహితుడు, ప్రధాని మోదీతో మాట్లాడాను. భారతీయ పైలట్, హీరో స్మిత్ మచ్చర్‌తో కలిసి ఇజ్రాయెల్ స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనాలని కోరాను. ఈ వేడుకలకు ఆహ్వానం పలికినందుకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇండియా, ఇజ్రాయెల్ రెండు దేశాలు తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి” అని తెలిపారు.
దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం గురించి మోదీ ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై హర్షం వ్యక్తం చేశారు అంటూ నెతన్యాహు పేర్కొన్నారు. ఈ మేరకు మోదీతో ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. ఇదే సమయంలో ఇటీవల విమానం ప్రమాదం నుంచి ఇజ్రాయెల్ పౌరులను కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌ను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. ఆయనతో కలిసి ప్రధాని మోదీ అక్కడ టార్చ్ వెలిగిస్తారు.
“పశ్చిమ ఆసియాలోని ఇటీవలి పరిణామాలపై కూడా ఇరు దేశాల నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెప్పారు. ముందుకు సాగడానికి చర్చలు, దౌత్యమే మార్గమని భారతదేశం చేసిన పిలుపును ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు,” అని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రధాని మోదీ ఫిబ్రవరి 25, 26 తేదీల మధ్య ఇజ్రాయెల్‌లో అధికారిక పర్యటన చేసిన విషయం గమనార్హం. ఆ పర్యటనలో ఇరు దేశాల నాయకులు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ‘శాంతి, ఆవిష్కరణ, శ్రేయస్సు కోసం ఒక ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ అనే కొత్త స్థాయికి తీసుకెళ్లాలని అంగీకరించి, నిర్ణయించారు.

More Stories
బలూచిలో మతమార్పిడి, వివాహం నుండి బయటపడ్డ హిందూ బాలిక
రష్యా-ఉక్రెయిన్ పోరుపై వచ్చే నెల త్రైపాక్షిక భేటీ?
సామా బిన్ లాడెన్ హతమైన దేశంలోనే దావూద్ నివాసం