మానస చిన్నారుల ఆరోగ్య వైకల్యాల అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని “మానసిక వికాసం ద్వారా జీవితాలకు సాధికారత: మేధోపరమైన వైకల్యాలు కలిగిన పిల్లల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు” అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ అందరికీ సమాన అవకాశాలు కల్పించే సహాయక వాతావరణాన్ని సృష్టించాలని ఆమె సూచించారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా తెలంగాణ నార్త్ రీజియన్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ రీజినల్ హెడ్ అభిషేక్ భారతి పాల్గొంటూ మానస అందిస్తున్న సేవలను అభినందించారు. ఆటిజం, అభివృద్ధి సంబంధిత వైకల్యాలపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరాన్ని వివరిస్తూ వైకల్యాలను సకాలంలో గుర్తించడం, పిల్లల చికిత్స, అభ్యాసన ప్రక్రియలో తల్లిదండ్రులు చురుకుగా పాల్గొనడం, కుటుంబాలకు అందుబాటులో ఉన్న సేవల గురించి విస్తృత అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి. కోటేశ్వర్ రావు ప్రసంగిస్తూ మేధోపరమైన వైకల్యాలు కలిగిన పిల్లల సంరక్షణ, శిక్షణలో తల్లులు మరియు సంరక్షకుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. పిల్లల అభివృద్ధికి తగిన విధంగా సహకరించేందుకు తల్లిదండ్రులకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలను అందించడం ముఖ్యమని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా, బ్యాంక్ ఆఫ్ బరోడా తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) నిధుల ద్వారా అందించిన రూ. 7,61,342తో కొనుగోలు చేసిన థెరపీ పరికరాలు, చికిత్సా ఉపకరణాలు, బోధన, అభ్యసన సామగ్రిని ప్రారంభించి, సంస్థకు అంకితం చేశారు. మానసా అధ్యక్షుడు డాక్టర్ బి. దినేష్ కుమార్ బ్యాంక్ ఆఫ్ బరోడా అందించిన సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహకారం ద్వారా సంస్థలో దివ్యాంగ పిల్లలకు అందిస్తున్న స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఫిజియోథెరపీ, ఎర్లీ ఇంటర్వెన్షన్, ప్రత్యేక విద్యా సేవలను మరింత బలోపేతం చేయడానికి వీలవుతుందని ఆయన తెలిపారు.
మరో విశేషమైన సహకారంగా, శ్రీరామ్ పాఠశాలలకు చెందిన పిల్లలు, తల్లిదండ్రులు, సిబ్బంది సమిష్టిగా నిధులు సమకూర్చి మానసకు ఫిజియోథెరపీ పరికరాలను అందించారు. హైదరాబాద్లోని శ్రీరామ్ పాఠశాలల అడ్మిషన్స్ విభాగాధిపతి శ్రీమతి సంధ్య వేమూరు, శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్ డీజీఎం–హెచ్ఆర్ శ్రీమతి నీరజ కాకుమాను ఈ పరికరాలను మానస ఫిజియోథెరపీ విభాగాధిపతి శ్రీమతి జి. స్వర్ణరేఖకు అందజేశారు.

More Stories
మహిళా మోర్చా ఆధ్వర్యంలో గాంధీ భవన్ ముట్టడి
ఎస్ఐఆర్పై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి
అశాంతిని ప్రేరేపిస్తున్న రాహుల్, కేజ్రీవాల్