భారత స్టాక్ మార్కెట్లు సూచీలు గురువారం సెషన్‌లో దారుణంగా కుదేలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్కసారిగా కుప్పలాయి. తాజా సమాచారం ప్రకారం ఇవాళ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సుమారు 1100 పాయింట్లు కోల్పోయింది, మరో వైపు నిఫ్టీ సుమారు 365 పాయింట్లు పడిపోయింది. ఉదయం నుంచి ట్రేడింగ్‌లో స్టాక్‌మార్కెట్లు పేలవ ప్రదర్శన కనబరిచాయి. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా కుప్పకూలిపోవడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది.
బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.8.5 లక్షల కోట్ల మేర తగ్గింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు దేశీయ సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి బుధవారం ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్టాక్‌మార్కెట్లు భిన్నంగా రియాక్ట్ అయ్యాయి. రెండు స్టాక్ ఎక్సేంజీల్లో ఒక శాతం మేర ట్రేడింగ్ పడిపోయింది.
రెపో రేటు పెంచడం వల్ల ఇన్వెస్టెర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో నిఫ్టీ 22,357 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. ఆ సమయంలో నిఫ్టీ సుమారు 245 పాయింట్లు కోల్పోయింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 71,947 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. సుమారు 691 పాయింట్లు కోల్పోయింది. మార్కెట్ పతనానికి ప్రధాన కారణాల్లో ముడి చమురు ధరల పెరుగుదల కూడా ఒకటి.
మధ్యప్రాచ్యంలో సరఫరాకు సంబంధించిన ఆందోళనలు కొనసాగడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర 3.9 శాతం పెరిగి బ్యారెల్‌కు 104.09 డాలర్లకు చేరింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారత ఈక్విటీల్లో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 7న ఎఫ్‌ఐఐలు సుమారు రూ.6,121 కోట్ల విలువైన భారత ఈక్విటీలను విక్రయించారు. ఎఫ్‌ఐఐల నిరంతర అమ్మకాలు కొనసాగితే మార్కెట్‌పై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ 5.3 శాతం ప్రాంతానికి చేరడం కూడా ప్రపంచ మార్కెట్లపై ఒత్తిడి పెంచింది. డాలర్ బలపడటంతో రూపాయి కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఐటీసీ, అదానీ పోర్ట్స్, ఇండిగో, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి సంస్థలు సెన్సెక్స్‌లో భారీగానే నష్టపోయాయి. ఆ కంపెనీల షేర్లు సుమారు 4 శాతం మేర తగ్గాయి. ఇక ఐటీ కంపెనీలు టెక్ మహేంద్ర, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఇన్‌ఫోసిస్ సుమారు రెండు శాతం వృద్ధి సాయించాయి.

More Stories
రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ
పంజాబ్ సీఎం మాన్ క్యాంపు కార్యాలయంలో సీబీఐ సోదాలు
జిడిపి 6.6 శాతం నుంచి 7.1 శాతానికి పెంచిన ప్రపంచ బ్యాంకు