మెడిస‌న్‌లో ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు నోబెల్

స్టాక్‌హోమ్‌: వైద్య‌శాస్త్రంలో ఈ యేటి నోబెల్ బ‌హుమ‌తిని ప్ర‌క‌టించారు. మెడిస‌న్‌లో ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు నోబెల్ ద‌క్కింది. కార్ల్ డిసెరోత్‌, పీట‌ర్ హేగ్‌మాన్‌, జార్జ్ న‌గేల్‌  2026 మెడిసిన్ నోబెల్ బ‌హుమ‌తి గెలుచుకున్నారు. ఐయాన్ ఛానల్స్‌తో పాటు ఆప్టో జెన‌టిక్స్‌లో ఆ ముగ్గురు శాస్త్రేవేత్త‌లు కొత్త డిస్క‌వ‌రీ చేసిన‌ట్లు నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.  మెద‌డులో క‌లిగే ఆలోచ‌న‌లు, జ్ఞ‌ప‌కాలు, భావోద్వేగాలు, ప్ర‌వ‌ర్త‌న‌ల గురించి పరిశోధ‌కులు అధ్య‌య‌నం చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ ముగ్గురు శాస్త్ర‌వేత్త‌లు ఆప్టోజెన‌టిక్స్‌లో కొత్త విష‌యాన్ని కొనుగొన్నారు. మెద‌డులో ఉన్న నాడీ క‌ణాల స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ యాక్టివిటీ గురించి ఈ శాస్త్ర‌వేత్త‌లు తేల్చారు.  అయితే వీళ్లు క‌నుగొన్న ప‌ద్ధ‌తుల్లోనే వివిధ దేశాల్లోనూ ల్యాబ్‌ల్లో మెద‌డు మిస్టరీని స్ట‌డీ చేస్తున్న‌ట్లు నోబెల్ క‌మిటీ పేర్కొన్న‌ది. అమెరికాలోని హోవార్డ్ హూగ్స్ మెడిక‌ల్ ఇన్స్‌టిట్యూట్ అండ్ స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీలో కార్ల్ డీస‌రోత్‌, జ‌ర్మ‌నీలోని హ‌మ్‌బోల్డ్ యూనివ‌ర్సిటీ ఆఫ్ బెర్లిన్‌లో పీట‌ర్ హెగ్‌మాన్‌, జ‌ర్మ‌నీలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ వుర్జ్‌బ‌ర్‌లో జార్జ్ న‌గేల్ ప్రొఫెస‌ర్లుగా చేస్తున్నారు.

సాధారణంగా, నాడీ కణాలు విద్యుత్ సంకేతాల ద్వారా సంభాషిస్తాయి. కాంతి-నియంత్రిత అయాన్ ఛానెల్‌లు ఆ సంకేతాలను ప్రభావితం చేయడానికి పరిశోధకులకు ఒక మార్గాన్ని అందిస్తాయి. ఒక న్యూరాన్‌లో కాంతి-సున్నితమైన ఛానెల్‌ను వ్యక్తీకరించినప్పుడు, దానిని తగిన కాంతికి గురిచేయడం వల్ల అయాన్లు కణ త్వచం గుండా కదలడానికి కారణమవుతుంది. ఇది న్యూరాన్ విద్యుత్ స్థితిని మార్చగలదు. ఉపయోగించబడుతున్న వ్యవస్థను బట్టి, దాని కార్యాచరణను ఉత్తేజపరచగలదు లేదా నిరోధించగలదు.

కాంతితో ఎంపిక చేసిన న్యూరాన్‌లను నియంత్రించగల ఆ సామర్థ్యం, ​​నిర్దిష్ట కణాలు, నాడీ వలయాలు ప్రవర్తనకు, ఇతర విధులకు ఎలా దోహదపడతాయో పరిశోధించడానికి శాస్త్రవేత్తలకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఛానల్‌రోడోప్సిన్‌లపై జరిగిన పరిశోధనలో, అధిక తాత్కాలిక కచ్చితత్వంతో కణాలలో విద్యుత్ కార్యకలాపాలను ప్రేరేపించడానికి కాంతిని ఉపయోగించవచ్చని తేలింది. తదనంతర కృషి, నాడీ వ్యవస్థను అధ్యయనం చేయడానికి ఆప్టోజెనెటిక్స్‌ను ఒక శక్తివంతమైన పద్ధతిగా స్థాపించడంలో సహాయపడింది.

1901 నుంచి 116 మెడిసిన్ ప్రైజ్‌ల‌ను ప్ర‌క‌టించారు. 232 మంది వ్య‌క్తులు మెడిసిన్‌లో ప్రైజ్ అందుకున్నారు. వైద్య శాస్త్రంలో నోబెల్ అందుకున్న అతిపిన్న వ‌య‌స్కుడు ఫ్రెడ్రిక్ బ్యాటింగ్. 32 ఏళ్ల వ‌య‌సులో అత‌ను ఆ అవార్డు గెలిచాడు. అవార్డు అందుకున్న వృద్ధుడిగా పేట‌న్ రౌస్ ఉన్నారు. ఆయ‌న 87 ఏళ్ల వ‌య‌సులో మెడిసిన్ నోబెల్ అందుకున్నారు.  వైద్యంలో నోబెల్ బ‌హుమ‌తిని ఏ ఒక్క శాస్త్ర‌వేత్త కూడా రెండోసారి గెలుచుకోలేదు. స్టాక్‌హోమ్‌లోని క‌రోలిన్‌స్కా ఇన్స్‌టిట్యూట్‌లో మెడిసిన్ నోబెల్‌ను ప్ర‌క‌టిస్తారు. ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తుల ప్రైజ్‌మ‌నీ 12 మిలియ‌న్ల స్వీడిష్ క్రాన‌ర్లుగా నిర్ధారించారు.

 

About The Author