విద్యా భారతి అఖిల భారతీయ శిక్ష సంస్థాన్ ఆద్వర్యంలో, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ కేంద్రంగా బండ్లగూడ జాగీరులో గల శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో జాతీయస్థాయి స్కేటింగ్ పోటీలు ఘనంగా నిర్వహించారు. అఖిలభారత ఖేల్ కూద్ లో భాగంగా 3 రోజులు పాటు జాతీయ స్థాయిలో స్కేటింగ్ పోటీలు జరిగాయి. ఉద్ఘాటన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎల్.వి సుబ్రహ్మణ్యం, దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ పోటీలలో మొత్తంగా వివిధ క్షేత్రాల నుండి, అనేక రాష్ట్రాల నుంచి 53 మంది బైకులతో సహా168 విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయస్థాయి పోటీలకు అనువైన అన్ని సౌకర్యాలు సదుపాయలతో ఉన్న 120 మీటర్ల స్కేటింగ్ ట్రాక్ పై సువిశాలమైన ఆటస్థలంలో ఎంతో ఉత్సాహంగా ఔత్సాహిక విద్యార్థులు స్కేటింగ్ పోటీలలో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎస్.ఎల్ ఇన్ఫ్రా గ్రీన్ బిల్డింగ్స్ అధినేత పెరియవరం గోపాల్ రెడ్డి , చామర్తి ఉమామహేశ్వరరావు, లింగం సుధాకర రెడ్డి పాల్గొని విజేతలకు స్వర్ణ,రజత, కాంస్య పతకాలు అందించారు.
ఈ మూడు రోజలు జరిగిన విద్యాభారతి జాతీయస్థాయి పోటీలలో గెలుపొందిన విద్యార్థులు స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్. జి. ఎఫ్. ఐ)కు ఎంపిక కావడం విశేషం. ఈ స్కేటింగ్ పోటీలలో పాల్గొన్న విద్యార్థులను, విజేతలను ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్,
పాఠశాల కార్యదర్శి ఎన్. వి. కే విశ్వేశ్వరరావు, ప్రిన్సిపల్ రమా విశ్వనాథన్ అభినందించారు.
పాఠశాల కార్యదర్శి ఎన్. వి. కే విశ్వేశ్వరరావు, ప్రిన్సిపల్ రమా విశ్వనాథన్ అభినందించారు.
విలువలు గల విద్య ను అందించే విద్యా భారతి అనుబంధ స్కూల్ అయిన శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్లో క్రీడలకు పెద్దపీట వేయడం జరుగుతుంది. అత్యంత ప్రమాణాలతో విద్యను బోధించడంతో పాటుగా భారతీయ విలువలను నేర్పిస్తూ క్రీడలకు అవకాశం ఇస్తారు. అనేక జాతీయ స్థాయి క్రీడా పోటీలకు స్విస్ ఆతిథ్యం ఇవ్వటం విశేషం.

More Stories
ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం
రాహుల్ గాంధీ మానసిక స్థితిపై కిషన్ రెడ్డి అనుమానం
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణపతి