దేశంలోనే తొలి ఎల్ఎన్‌జీ రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. గుజరాత్ లోని సబర్మతి రైల్వేస్టేషన్ లో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఎల్‌ఎన్‌జీతో నడిచే రైలును ప్రారంభించడం ద్వారా ప్రపంచంలో ఈ సాంకేతికత కలిగిన నాలుగు దేశాల సరసన భారత్ నిలిచింది. రైలు ప్రారంభం అనంతరం నిర్వహించిన సభలో అమిత్ షా ప్రసంగిస్తూ దేశ రైల్వే వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ సమూలంగా మార్చారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ తన పాలనలో కుంభకోణాలు తప్ప ఇంకేమీ చేయలేదని విమర్శించారు. గత 12 ఏళ్లలో ప్రధాని మోదీపై ఎవరూ అవినీతి ఆరోపణలు చేయలేకపోయారని పేర్కొన్నారు. అర్థరహితంగా మాట్లాడే హస్తం పార్టీని వాస్తవాలు, గణాంకాల ఆధారంగా చర్చకు రావాలని సవాల్ చేయండని ప్రజలకు పిలుపునిచ్చారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యేక సరకు రవాణా కారిడార్, రాపిడ్ రైల్ సిస్టమ్, అత్యాధునిక స్టేషన్లకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
ఎల్‌ఎన్‌జీతో నడిచే రైలును ప్రారంభించడం ద్వారా ప్రపంచంలో ఆ సాంకేతికత కలిగిన నాలుగు దేశాల సరసన భారత్‌ను నిలిపారని కొనియాడారు. ముంబయి నుంచి వడోదర వరకు మొట్టమొదటి లాంగ్ డబుల్ స్టాక్ కంటైనర్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిందని అమిత్ షా చెప్పారు. మొత్తం 11 వేల కిలోమీటర్ల రైలు కారిడార్‌ను నాలుగు ట్రాక్‌ల నెట్‌వర్క్‌గా మార్చుతున్నామని తెలిపారు. ఇదిలావుంటే ఈ కొత్త రైలు ఎల్‌ఎన్‌జీ, డీజిల్ రెండింటిపై నడుస్తుందని పేర్కొన్నారు.
డీజిల్ వినియోగంలో సుమారు 40 శాతాన్ని ఎల్‌ఎన్‌జీతో భర్తీ చేస్తుందని చెప్పారు. డీజిల్ వినియోగం, ఇంధన ఖర్చులు, ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఎల్ఎన్‌జీ రైలును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. రైల్వేలలో డీజిల్ వినియోగం 2015–16లో 293 కోట్ల లీటర్ల నుండి 2024–25 నాటికి 108 కోట్ల లీటర్లకు తగ్గిందని అమిత్ షా పేర్కొన్నారు. రైల్వే విద్యుదీకరణ గణనీయంగా విస్తరించిందని, 2014కు ముందు సుమారు 30 శాతంగా ఉన్న ఇది ప్రస్తుతం 99.6 శాతానికి చేరిందని, మిగిలిన 0.4 శాతం పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని ఆయన తెలిపారు.
రైల్వే విద్యుదీకరణ 2010–11లో 7,188 కిలోమీటర్ల నుండి 2023–24 నాటికి 7,188 కిలోమీటర్లకు పెరిగిందని కేంద్ర మంత్రి షా చెప్పారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రారంభించిన ప్రాజెక్టులలో డబ్ల్యుఏజి-12 నిర్వహణ షెడ్, సబర్మతి–కలోల్–సబర్మతి మార్గంలో ‘కవచ్’ రైలు రక్షణ వ్యవస్థ ఏర్పాటు, అలాగే అహ్మదాబాద్–పాలన్పూర్, అహ్మదాబాద్–సమఖియాలి మార్గాల్లో కవచ్ సంబంధిత పనుల ప్రారంభం వంటివి ఉన్నాయి.
ప్రభుత్వ సమాచారం ప్రకారం, సబర్మతి–కలోల్–సబర్మతి కవచ్ ప్రాజెక్టును రూ. 48 కోట్ల వ్యయంతో చేపట్టారు. సబర్మతి–సర్ఖేజ్ రైల్వే లైన్ డబ్లింగ్ (రెండు లైన్ల విస్తరణ) పనులు కూడా ప్రారంభమయ్యాయి.
More Stories
కోల్కతా దుర్గాపూజలో తొక్కిసలాట.. 19 మంది మృతి!
జమ్మూ కాశ్మీర్లో, ఇద్దరు అధికారులు, వేర్వేరు మార్గాలు
మాన్సా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకంపై ఎన్ఐఏ, ఈడీ విచారణ జరపాలి