సింగ్ అని పోస్టర్‌లో నేరుగా చెప్పడం వల్ల.. అది ఇండో అమెరికన్లను, ముఖ్యంగా సిక్కు గ్రూపులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. యూ డోన్ట్ నో హౌ టూ డ్రైవ్ అన్న ట్యాగ్‌లైన్ రాయడం ఇటీవల అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంగ్ల ప్రావీణ్యత పరీక్షలలో విఫలమైనందుకు 26,000 మందికి పైగా వాణిజ్య డ్రైవర్లను విధుల నుండి తొలగించగా, వేగంగా మారుతున్న విధానాల వల్ల ప్రభావితమైన ట్రక్కర్ల కోసం సిక్కు సమూహాలు పంజాబీ భాషా వనరులను, చట్టపరమైన మద్దతును సమకూరుస్తున్నాయి.
ట్రక్కు డ్రైవర్లుగా అమెరికాలో నివసిస్తున్న డాక్యుమెంటేషన్ లేని భారతీయుల్ని డిపోర్ట్ చేయాలని అమెరికా భావిస్తున్నది. కమర్షియల్ ట్రక్కు డ్రైవర్లను ఇటీవల అమెరికా సర్కారు కఠినంగా స్క్రూట్నీ చేస్తున్నది. కమర్షియల్ డ్రైవర్స్ లైసెన్సు జారీ అంశంలో రూల్స్‌ను కూడా పకడ్బందీగా చేసింది. అయితే పోస్టర్‌లో సింగ్ అని పేరు పెట్టడం.. అది జాతివివక్షకు దారి తీస్తుందని విమర్శకులు స్పష్టం చేస్తున్నారు.
ఈ ప్రకటనలో ‘మిస్టర్ సింగ్’ అని ప్రస్తావించడంపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్), సిక్కు కొయలేషన్ వంటి అనేక ప్రతినిధి సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘‘సింగ్‌లు’ హిందువులు, వారు సిక్కులు, వారు అమెరికన్లు, వారు వాహనాలు నడుపుతారు. ట్రంప్ ప్రభుత్వం చేసిన ఈ జాత్యాహంకార, భారత వ్యతిరేక వ్యాఖ్యలు షాక్‌కు గురిచేస్తున్నాయి’’ అని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్ లో పేర్కొంది.
“ఫెడరల్ ఏజెన్సీ చేసిన ఈ వివక్షాపూరిత పోస్ట్ రాజకీయ సందేశాలకు అతీతంగా ఉంది. దీనిపై తక్షణ విచారణను మేము స్వాగతిస్తున్నాం’’ అని పేర్కొంటూ ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌కు హిందూ అమెరికన్ ఫౌండేషన్ అసిస్టెంట్ అటార్నీ జనరల్ హర్మీత్ కె ధిల్లాన్ ట్యాగ్ చేశారు. ‘‘9/11 దాడి జరిగి పాతికేళ్లు గడిచినా ఇప్పటికీ సిక్కులు తమ రూపం ఆధారంగా లక్ష్యంగా మారుతున్నారు’’ అని సిక్కు సమాజం ఆవేదన వ్యక్తం చేసింది.‘‘అమెరికాలోని మిలియన్ల మంది సిక్కుల ఇంటిపేరు ‘సింగ్’, దానికి అర్థం సింహం. మా ప్రభుత్వమే మమ్మల్ని శత్రువులుగా చిత్రీకరించినప్పటికీ, మేము సిక్కులుగా గుర్తింపుపొందడానికి భయపడం’’ అని సిక్కు కోయలిషన్ తెలిపింది. అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా అమెరికాను వీడేందుకు ఉద్దేశించిన ‘సిబిపి హోమ్’ కార్యక్రమాన్ని ప్రచారం చేసేందుకు ట్రంప్ యంత్రాంగం ఈ ప్రయత్నం చేస్తోంది. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లడానికి నమోదు చేసుకున్న వారికి ప్రయాణ సహాయంతో పాటు 2,600 డాలర్ల ఎగ్జిట్ బోనస్ కూడా లభిస్తుందని డిహెచ్ఎస్ తెలిపింది.

More Stories
జిన్‌పింగ్ పర్యటన వ్యాపార సంబంధాలను మెరుగు పరుస్తుందా?
జెలెన్స్కీ విమానాన్ని దాదాపు ఢీకొట్టిన డ్రోన్?
అధికారమే లక్ష్యంగా 18 నుండి పంజాబ్‌లో బీజేపీ నాలుగు యాత్రలు