నాలుగేళ్లుగా యుద్ధం జరుగుతున్న రష్యా- యుక్రెయిన్ ల మధ్య శాంతిని నెలకొల్పేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, మధ్యవర్తిత్వంతో సహా ఇతర సహాయానికి కూడా భారత్ సిద్ధం అని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి కుదరడమే ప్రాధాన్యం అని తెలిపారు. ఇరు దేశాల మధ్య చర్చలు, మధ్యవర్తిత్వం, దౌత్య పరమైన చర్చల ద్వారానే శాంతి నెలకొంటుందని స్పష్టం చేశారు.
తన ఒకరోజు ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా గురువారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కలిసిన సందర్భంగా కొనసాగుతున్న సంఘర్షణను ముగించేందుకు భారతదేశం అనుసరిస్తున్న విధానంపై చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు సహాయం చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు శాంతి సందేశం పంపిన తర్వాత ఆయన ఉక్రెయిన్‌లో పర్యటించడం గమనార్హం.
“నేను భారత విదేశాంగ మంత్రి @DrSJaishankar ను కలిశాను. మేము ముఖ్యమైన అంశాలపై చర్చించాము. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న ఈ అన్యాయమైన యుద్ధాన్ని ముగించడానికి భారతదేశం చూపిస్తున్న నిబద్ధతకు మేము కృతజ్ఞులం. ఇది ఖచ్చితంగా యుద్ధ సమయం కాకూడదు. శాంతి అవసరం. ఇదే భారతదేశం యొక్క స్పష్టమైన వైఖరి,” అని జెలెన్స్కీ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
జైశంకర్ పర్యటన సందర్భంగా ఇరాన్ సహాయంతో రష్యా, ఉక్రెయిన్‌పై జెట్-పవర్డ్ ‘షాహెద్’ డ్రోన్‌లను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆరోపించారు. అయితే, ఆ డ్రోన్‌లలో చాలా వరకు ఉక్రెయిన్ యుద్ధ విమానాలు కూల్చివేశాయి. “నిస్సందేహంగా, మేము నల్ల సముద్రంలోని పరిస్థితి గురించి, పౌర నౌకాయానానికి ఉన్న ముప్పులతో సహా చర్చించాము. ఇది అత్యంత సున్నితమైన అంశంగా ఉన్న ప్రాంతాలకు అక్కడి ప్రజలు ఈ సముద్ర మార్గాలపై ఆధారపడి జీవిస్తున్నందున, ఆహార సరఫరాలను నిరోధించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మేము ఏకీభవిస్తున్నాము” అని తెలిపారు.
“మా ఓడరేవులను, మా ఆహార కారిడార్‌ను, మా సరఫరాలను అడ్డుకోవడమే లక్ష్యంగా రష్యా తీసుకుంటున్న చర్యలు ప్రపంచ సంబంధాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. భద్రతకు హామీ ఇవ్వడానికి మనమందరం కలిసి పనిచేయాలి. ధన్యవాదాలు!” అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, కొనసాగుతున్న సంఘర్షణను ముగించే మార్గాలపై జెలెన్స్కీతో తన సంభాషణ కేంద్రీకృతమైందని జైశంకర్ చెప్పారు. “ఈరోజు #ఉక్రెయిన్ అధ్యక్షుడు @ZelenskyyUa ను కలవడం ఆనందంగా ఉంది. మా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంపై విదేశాంగ మంత్రి @andrii_sybihaతో జరిపిన చర్చల గురించి ఆయనకు తెలియజేశాను. కొనసాగుతున్న సంఘర్షణను ముగించే మార్గాలపై మా సంభాషణ కేంద్రీకృతమైంది,” అని ఆయన తెలిపారు.

More Stories
18వ అంతర్జాతీయ శతకంతో స్మృతి మంధాన కొత్త చరిత్ర
వందేళ్ల నాటి ఆలయం కూల్చివేత `అభ్యంతరకర విధ్వంస చర్య’
బంగ్లాదేశ్‌లో ‘జాతీయ సంక్షోభం’.. తాజా ఎన్నికలకై హసీనా పిలుపు